For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wipro: ఉద్యోగికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదంటున్న Rishad Premji.. టెక్కీలు తెలుసుకోండి..

|

Wipro: సాధారణంగా యువ టెక్కీలు తమకు పనిచేసేందుకు తగిన టాలెంట్ ఉంది కాబట్టి కార్పొరేట్ కంపెనీలు తమను తప్పక ఎంపిక చేసుకుంటాయని భావిస్తుంటారు. ఇలా కొంత మంది తలబిరుసుతోనూ ఉంటుంటారు. అయితే ఇలాంటి అపోహలు పక్కన పెట్టాల్సిందేనని కంపెనీ యాజమాన్యాలను చూస్తే అర్ధమౌతుంది.

రిషద్ ప్రేమ్‌జీ..

రిషద్ ప్రేమ్‌జీ..

అజిమ్ ప్రేమ్‌జీ తర్వాత విప్రో కంపెనీ పగ్గాలను చేపట్టారు రిషద్ ప్రేమ్‌జీ తీసుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత విప్రోలో నిర్ణయాలు చాలా వేగంగా, అత్యంత స్పష్టంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన నాస్కామ్ టెక్నాలజీ & లీడర్‌షిప్ ఫోరమ్ 2023లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను ఫాలో అయ్యే రిక్రూట్మెంట్ సూత్రం గురించి ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నియామకం ఆలోచన..

నియామకం ఆలోచన..

ప్రేమ్‌జీ తన టెక్ కంపెనీని వైవిధ్యంగా, అందరినీ కలుపుకొని పోయేలా ఎలా పని చేస్తున్నారో అడిగినప్పుడు.. తన బోర్డు సభ్యుల్లో ఒకరితో మాట్లాడిన తర్వాత రిక్రూట్మెంట్ పట్ల తన అభిప్రాయం మారిందని తెలిపారు. తన ఆలోచనలను సవాలు చేయగల, కొత్త దృక్కోణాలను తీసుకురాగల అభ్యర్థి కోసం వెతుకుతున్నానని ఆయన వెల్లడించారు. తద్వారా విప్రోను వైవిధ్యంగా మార్చినట్లు తెలిపారు.

 సంబంధాలు..

సంబంధాలు..

ఆఫీసులో వ్యక్తుల మధ్య సంబంధాలు చాలా ముఖ్యమైనవని ప్రేమ్‌జీ నొక్కిచెప్పారు. కంపెనీలో సంస్కృతిని నిర్మించడం ప్రయాణం కాదని.. గమ్యమని విప్రో చైర్మన్ వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రెషర్లు చేరినందున కొత్త వ్యక్తులతో వర్చువల్‌గా సంబంధాన్ని పెంచుకోవడం కష్టమని ఆయన అన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. అది వ్యక్తిగతంగా నిర్మించుకోగల సంబంధాలకు సహాయపడదని అభిప్రాయపడ్డారు.

 ఆఫీసు నుంచి పని..

ఆఫీసు నుంచి పని..

భవిష్యత్తు హైబ్రిడ్ వర్క్ కల్చర్ అయినప్పటికీ తాను మాత్రం ఆఫీసుల నుంచి పని చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తానని ఈ వ్యాపారవేత్త వెల్లడించారు. కరోనా సమయంలో ఎలాంటి ఎజెండా లేకుండా ఉద్యోగుల మాటలు వినేందుకు ఒక కంపెనీ బాస్ చేసిన ప్రయత్నాన్ని ఆయన కొనియాడారు. తాను కూడా వారంలో 15 నిమిషాల పాటు ఎజెండా లేకుండా మాట్లాడాలని తాను కూడా అనుకుంటున్నానని వెల్లడించారు.

English summary

Wipro: ఉద్యోగికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదంటున్న Rishad Premji.. టెక్కీలు తెలుసుకోండి.. | Wipro Chairman Rishad Premji reveals what he looks in a person for recruiting

Wipro Chairman Rishad Premji reveals what he looks in a person for recruiting
Story first published: Wednesday, March 1, 2023, 17:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X