For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ లో ఆస్తుల విలువలు ఇంత పెరిగాయా?

|

హైద్రాబాద్... కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర రాజధాని... దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ హైద్రాబాద్ కు ప్రత్యేకత ఉంది. ఐటీ, ఫార్మాకు పెట్టింది పేరు. ఇక్కడి మౌలిక సదుపాయాలు అదుర్స్. సుస్థిరమయిన రాష్ట్ర ప్రభుత్వం... మెరుగైన పాలన.. అనుమతుల్లో సులభతరం వంటి అంశాలు తెలంగాణకు ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి కలిసి వస్తున్నాయి. ఇక్కడున్న వాతావరణానికి ఎక్కడి వారైనా ఫిదా కావాల్సిందే. అందుకే అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు నగరాన్ని వదిలి పెట్టే పరిస్థితి ఉండదు. ఇక ఇళ్ల ధరల విషయానికి వస్తే నగరంలోని ప్రధాన నగరాల్లో ధరలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకే ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అందుకే ధరలు కూడా పెరుగుతున్నాయి. మరి విలువల్లో పెరుగుదల ఏవిధంగా ఉందంటే.....

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్: జియో ధరలే తక్కువఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్: జియో ధరలే తక్కువ

15% పెరుగుదల...

15% పెరుగుదల...

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై-సెప్టెంబర్)లో ఇళ్ల విలువలు గత ఏడాది ఇదే త్రైమాసికం తో పోల్చితే 15 శాతం మేర పెరిగాయని ప్రాప్ టైగర్ డాట్ కామ్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇతర మార్కెట్లలో పెద్దగా మార్పు లేదట.

* దేశంలోని ప్రధాన మార్కెట్లలో ధరలు దిద్దుబాటుకు గురవుతున్నాయి. ఇందుకు గట్టి కారణాలే ఉన్నాయి. చాలా నగరాల్లో అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. దీని వల్ల డెవలపర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఉన్న నిల్వలను తగ్గించు కోవడానికి ధరలు తగ్గించే పరిస్థితి కూడా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.

* ఇందుకు భిన్నంగా హైద్రాబాద్ లో ధరలు పెరుగుతున్నాయి. ఇందుకు ఇక్కడి మార్కెట్ పై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండటమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

గత ఐదేళ్ళలో....

గత ఐదేళ్ళలో....

* గత ఐదేళ్ల కాలంలో హైద్రాబాద్ లో ప్రాపర్టీ ల ధరలు జోరుగా పెరిగాయి. 2014 నుంచి ప్రాపర్టీ ల సగటు విలువ 45 శాతానికి పైగా పెరిగాయట. హైదరాబాద్ లో నివాస గృహాల మార్కెట్ పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. నగరానికి దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు, అధిక నాణ్యతతో కూడిన జీవన ప్రమాణాలు వంటివి ఇక్కడి మార్కెట్ పై ఇన్వెస్టర్లు, కొనుగోలుదారుల సెంటిమెంట్ పుంజుకోవడానికి దోహద పడుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

* హైదరాబాద్ లో చదరపు అడుగు ఇల్లు విలువ 2014 సంవత్సరంలో 3,500 స్థాయిలో ఉంటే.. ఇప్పుడు 5,200 దాటేసింది. నివాస గృహాలకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

మెట్రోతో మరింతగా..

మెట్రోతో మరింతగా..

* హైదరాబాద్ లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్థిరాస్తుల ధరలకు కొత్త రెక్కలొచ్చాయి. దీని విస్తరణలో భాగంగా కొత్త రూట్ల లోను సేవలు ప్రారంభమవడం వల్ల ఆయా ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇంకా ఒక రూట్ లో సేవలు ప్రారంభం కావలసి ఉంది. ఇవి కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్, నివాస గృహాల మార్కెట్ పరిస్థితులు మారిపోతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

* హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా నివాస గృహాలు ఉంటున్నాయి. సాధారణ మధ్య తరగతి నుంచి సంపన్నులు నివసించే విల్లా ల వరకు అన్ని విధాల నివాస గృహాలు అందిస్తున్నారు. అందుకే ఇక్కడి మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసుకుంటోంది.

* కొన్ని చోట్ల ధరలు బెంగళూరు, చెన్నై కన్నా ఎక్కువగా ఉన్నాయని కూడా.

English summary

హైదరాబాద్ లో ఆస్తుల విలువలు ఇంత పెరిగాయా? | Why Property prices in Hyderabad has been increasing?

Property prices in Hyderabad is increasing compare with some other cities in our country. Stable government, ease of approvals, infrastructure facilities, IT companies and some other reasons are helping the market growth.
Story first published: Monday, December 9, 2019, 8:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X