For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జంక్‌కు పైన భారత్ రేటింగ్, మూడీస్ రేటింగ్‌తో మన పరిస్థితేమిటి?

|

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత రుణ రేటింగ్‌ను తగ్గించింది. భారత సార్వభౌమ రుణ రేటింగును మూడిస్ ఇన్వెస్టర్స్ 22 ఏళ్లలోనే తొలిసారి తగ్గించింది. తక్కువ వృద్ధి, ఆర్థిక స్థితిగతుల క్షీణత వల్ల ఆర్థిక రంగ ఒత్తిడిని తగ్గించేందుకు సవాళ్లు ఎదుర్కోక తప్పదని తెలిపింది. దేశానికి గతంలో కేటాయించిన బీఏఏ2 నుండి బీఏఏ3కి రుణ రేటింగ్‌ను తగ్గించింది. భారత విదేశీ కరెన్సీ, స్థానిక కరెన్సీ దీర్ఘకాలిక ఇష్యూయర్ రేటింగ్స్ కూడా బీఏఏ2 నుండి బీఏఏ3కు తగ్గించింది.

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది, మీకు ఆశ్చర్యం వేయొచ్చు కానీఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది, మీకు ఆశ్చర్యం వేయొచ్చు కానీ

ఆ తర్వాత జంక్... ఎందుకు తగ్గించింది?

ఆ తర్వాత జంక్... ఎందుకు తగ్గించింది?

మూడీస్ రేటింగ్‌ను Baa2 నుండి Baa3 తగ్గించడం 2 దశాబ్దాలుగా ఇప్పుడే. ఇలా తగ్గించడం వల్ల మనపై ప్రభావం ఏమిటి? Baa3 అనేది అ్యంత తక్కువ రేటింగ్. దీని తర్వాత రేటింగ్ జంక్. అంటే దీని తర్వాత రేటింగ్ చేత్త. 2017 నుండి ఆర్థిక సంస్కరణల అమలు బలహీనంగా ఉందని, గత ఏడాదికి పైగా ఆర్థిక వృద్ధి తీవ్ర మందగమనంలో ఉందని, మూడీస్ తెలిపింది. కేంద్రం, రాష్ట్రాలలో ద్రవ్య పరిస్థితి బాగా క్షీణించిందని పేర్కొంది. దీంతో భారత ఆర్థిక రంగంలో ఒత్తిడి పెరిగిందని, అందుకే రేటింగ్ తగ్గించినట్లు కారణాలు తెలిపింది. అంతేకాదు, భారత్ రేటింగ్ మరింత తగ్గవచ్చునని సంకేతాలు ఇచ్చింది. ఈ రేటింగ్ ఇచ్చేందుకు కరోనాను లెక్కలోకి తీసుకోలేదని, ఇదే సమయంలో కరోనా వచ్చిందని పేర్కొంది. అంటే కరోనా ప్రభావాన్ని లెక్కలోకి తీసుకుంటే మరింత దిగజారుతుందని పరోక్షంగా తెలిపింది.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

2017లో మూడీస్ భారత రేటింగ్‌ను స్థిర భవిష్యత్తు అంచనాతో బీఏఏ2కు పెంచింది. కీలక సంస్కరణలు సమర్థవంతంగా అమలు చేస్తే సార్వభౌమ రుణ రేటింగ్ మరింత పెరుగుతుందని అప్పుడు చెప్పింది. కానీ ఇప్పుడు సంస్కరణలు బలహీనమని తెలిపింది. మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వివిధ సంస్కరణలు దీర్ఘకాలంలో మంచి ప్రయోజనమని, తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు.

మూడీస్ రేటింగ్ ప్రభావం ఎంత?

మూడీస్ రేటింగ్ ప్రభావం ఎంత?

గత కొంతకాలంగా భారత్ ద్రవ్యలోటు లక్ష్యం చేరుకోవడం లేదు. దీనికి తోడు అప్పులు పెరుగుతున్నాయి. 2018-19లో జీడీపీలో భారత రుణభారం 72 శాతంగా ఉంది. 2020 నాటికి ఇది 84 శాతానికి చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. భారత ఆర్థిక తీరుపై రేటింగ్ ఆధారపడి ఉంటుంది.

ఈ రేటింగ్ తగ్గిందంటే ప్రభుత్వం జారీ చేసే బాండ్స్‌కు అంతక్రితంతో పోలిస్తే మరింత నష్టభయం ఉన్నట్లుగా భావించవచ్చు. ఆర్థికంగా బలహీనం, ద్రవ్యస్థితి బాగా లేకుంటే ప్రభుత్వానికి తిరిగి చెల్లించే సామర్థ్యం తగ్గుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భారత్ కానీ, భారత్‌లోని కంపెనీలు కానీ విదేశాల్లో జారీ చేసే బాండ్స్‌కు డిమాండ్ తగ్గుతుంది. భారత ప్రభుత్వం లేదా భారత కంపెనీలు బయటి నుండి నిధులు సమీకరించడం కాస్త సంక్లిష్టమవుతుంది.

రేటింగ్ ప్రభావం ఉండదు..

రేటింగ్ ప్రభావం ఉండదు..

భారత్ పైన మూడిస్ రేటింగ్ ప్రభావం అంతగా ఏమీ ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎస్బీఐ నివేదిక కూడా అదే చెబుతోంది. మన విదేశీ రుణాలపై ప్రభావం పడినా తట్టుకునేందుకు సరిపడే విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి. మన సార్వభౌమ రుణాల్లో విదేశాలవి కేవలం 20 శాతమేనని చెబుతున్నారు. మన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలు రుణ అవసరాలకు సరిపోతాయని ఎస్బీఐ ఎకోరాప్ నివేదిక తెలిపింది. కాబట్టి మార్కెట్లు, ఎక్స్చేంజ్ రేట్, బాండ్స్‌పై ఇప్పటికిప్పుడు ప్రభావం ఉండదని చెబుతున్నారు.

English summary

జంక్‌కు పైన భారత్ రేటింగ్, మూడీస్ రేటింగ్‌తో మన పరిస్థితేమిటి? | Why Moody's downgraded India’s rating, what the implications may be

On Monday, Moody's downgraded the Government of India's foreign currency and local currency long-term issuer ratings to Baa3 from Baa2. It stated that the outlook remained negative.
Story first published: Wednesday, June 3, 2020, 7:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X