For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Berkshire:వారెన్ బఫెట్ టెక్ రంగంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయరు? కారణమిదే..!

|

జెఫ్ బెజోస్ అమెజాన్ చీఫ్‌గా తప్పుకున్న తర్వాత అంతరిక్షపుటంచుల వరకు వెళ్లి వచ్చారు. ఇక ఫేస్ బుక్ అధినేతగా సేవలందించి తప్పుకున్న తర్వాత మార్క్ జుకర్‌బర్గ్‌ మరో లెవెల్‌లో జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ అపర కుబేరుల పరిస్థితి ఇలా ఉంటే... మరో అత్యంత ధనికుడు వారెన్ బఫెట్ పరిస్థితి మాత్రం తలకిందులైంది. వ్యాపార రంగంలో పోటీ బాగా పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి. అయితే 90 ఏళ్ల వారెన్ బఫెట్ మాత్రం అదే పాత చింతకాయ పచ్చడిలాంటి ఐడియాలతోనే కొనసాగుతూ నష్టాలబాట పడుతున్నాడు. ప్రస్తుతం సరుకును రవాణా చేసేందుకు విమానాలు, డ్రోన్లను వాడుతున్న ఈ కాలంలో వారెన్ బఫెట్ ఇంకా రైళ్లలోనే రవాణా చేసే పద్దతి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పాత పద్ధతులను ఇంకా అవలంబిస్తుండటంతో వారెన్ బఫెట్ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతోంది. అదే సమయంలో మార్కెట్ విలువ కూడా పతనమైంది. అమెజాన్, ఫేస్‌బుక్ లాంటి సంస్థలతో పోటీ పడలేకపోతోంది.

టెక్నాలజీ రంగంలో లేని పెట్టుబడులు

టెక్నాలజీ రంగంలో లేని పెట్టుబడులు

బర్క్‌షైర్‌ సంస్థలో 100 బిలియన్ డాలర్ల మేరా బఫెట్ హోర్డింగ్స్ ఉన్నప్పటికీ... ఆ పెట్టుబడులను టెక్నాలజీ అనుసంధారిత ఆర్థిక రంగంలో పెట్టడంలో విఫలమయ్యారు. టెక్నాలజీ డ్రివెన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయన్న సంగతి విస్మరించి వ్యవహరించడంతో ఆయన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కసారిగా పతనమైంది. నష్టాల బాటలో నడుస్తోంది. అయితే అంత డబ్బులను నిల్వ ఉంచడంపై విమర్శలు వస్తున్నప్పటికీ బఫెట్ చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అమెజాన్ సంస్థ సీఈఓ ఆండీ జెస్సీ, ఫేస్‌బుక్ సంస్థ, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రో సాఫ్ట్ సంస్థ చీఫ్ సత్యా నాదెళ్లలాంటి వారు నేతృత్వం వహిస్తోన్న కంపెనీల వద్ద కూడా అధిక మొత్తంలో డబ్బులున్నాయి. అయితే ఈ సంస్థల ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ టెక్నాలజీ అనుసంధారిత ఆర్థిక సంస్థల్లోనే ఉన్నాయి. అదే సమయంలో లాభాల బాట నడుస్తున్నాయి.

లాభాల బాటలో బెర్క్‌షైర్...

లాభాల బాటలో బెర్క్‌షైర్...

ఒకప్పుడు బఫెట్ సంస్థ బెర్క్‌షైర్‌ కూడా లాభాలను ఆర్జించింది. దీంతో వెంటనే అధినేత వారెన్ బఫెట్ ఏ సంస్థను కొనుగోలు చేస్తున్నారో అప్పుడే ప్రకటించేవారు. ఆయన కంపెనీల్లో పనిచేసే సిబ్బంది కూడా ఆ ప్రకటన కోసం ఎదురుచూసేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు అదోగతిపాలైంది. ఎందుకంటే ఇప్పుడు బఫెట్ తన దగ్గర డబ్బులను మాత్రమే నిల్వ చేసుకుంటున్నారు తప్పితే... ఎక్కడైనా ఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచన చేయడం లేదట. ఈ సమయంలో ఏ రంగంలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ లాభాలు రావనే డెసిషన్‌కు వచ్చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఇన్వెస్ట్‌మెంట్స్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇందుకు తాజా ఉదాహరణ ఐదేళ్ల క్రితం ప్రెసిషన్ కాస్ట్‌పార్ట్స్ అనే సంస్థను 37 బిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేయగా అందులో లాభాలు కనిపించడం లేదట.

త్రైమాసిక ఫలితాలతో బఫెట్‌లో టెన్షన్

త్రైమాసిక ఫలితాలతో బఫెట్‌లో టెన్షన్

ఇక శనివారం త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో అన్ని సంస్థల సీఈఓలకు ఒక హెచ్చరికగానే ఉంటుందని ఆర్థిక రంగం నిపుణులు చెబుతున్నారు. ఇక వారెన్ బఫెట్‌కు ఈ రిపోర్టు మరింత శరాఘాతంగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా వారెన్ బఫెట్ నిర్మించిన తన వ్యాపార సామ్రాజ్యంకు కష్టాలు తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి కష్టాలే అమెజాన్ మాజీ చీఫ్ జెఫ్ బెజోస్‌కు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్‌కు వచ్చినప్పుడు వారు వెంటనే రియాక్ట్ అయి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే బఫెట్ పెట్టుబడులపై నమ్మకం కోల్పోయిన ఇన్వెస్టర్లు బెర్క్‌షైర్‌ స్టాక్స్‌పై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో నష్టాలు తప్పేలా లేదు.

ఇన్వెస్టర్లు ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు

ఇన్వెస్టర్లు ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు

కాలం మారుతున్న క్రమంలో టెక్నాలజీ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే సమయంలో లాభాల బాట కూడా పడుతున్నాయి. అయితే వారెన్ బఫెట్ మాత్రం టెక్నాలజీ రంగం వైపు ఆసక్తి చూపకపోవడంతో ఇన్వెస్టర్లు అతని స్టాక్స్‌పై ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక కరోనా కష్టకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా పెద్దగా రాణించలేదు. ప్రస్తుతం వచ్చే త్రైమాసిక రిపోర్టు ఆధారంగా పరిస్థితి ఎలా ఉంటుందనేదానిపై ఒక అంచనాకు రావొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వారెన్ బఫెట్ విషయానికొస్తే ఈ ఏడాది మార్చి నాటికి 145 బిలియన్ డాలర్ల మేరా డబ్బులు ఉండగా..బఫెట్ మాత్రం తిరిగి షేర్లను కొనుగోలు చేయడంలో మాత్రమే ఈ డబ్బును ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం.గతేడాది పరిశీలిస్తే బెర్క్‌షైర్ సంస్థ తమ స్టాక్స్‌ను మాత్రమే అమ్మకానికి పెట్టింది తప్పితే ఎలాంటి కొత్త కొనుగోళ్లు చేపట్టలేదు.

పెద్ద కంపెనీల్లో ఎందుకు కొనుగోలు చేయడం లేదు

పెద్ద కంపెనీల్లో ఎందుకు కొనుగోలు చేయడం లేదు

ఇదిలా ఉంటే బఫెట్ ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపకపోవడం వెనక ఒక కారణం ఉంది. తను తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. పెద్ద సంస్థల కొనుగోలు చేయాలంటే అవి సరైన లాభాలు గడిస్తాయో లేదో అన్న మీమాంస నెలకొందట. అంతేకాదు కొత్తగా జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఒక్క టెక్నాలజీ రంగంలోనే పెట్టుబడులు ఎందుకు అనే ఆలోచన చేస్తున్నారట. ఇక టెక్ దిగ్గజ సంస్థల షేర్లు కూడా క్రమంగా పడిపోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. అయితే ఈ టెక్ సంస్థలు పరిశోధనల్లో కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడితే ఏమైనా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే బెర్క్‌షైర్ ఈ రంగాలను నమ్ముకుని పెట్టుబడులు పెట్టలేదనే వాదన వినిపిస్తోంది.

1989 నాటి కంపెనీల గురించి

1989 నాటి కంపెనీల గురించి

ఈ ఏడాది మే నెలలో జరిగిన కంపెనీ సమావేశంలో బఫెట్ మాట్లాడుతూ 1989వ సంవత్సరంలోని టాప్ 20 కంపెనీల గురించి ప్రస్తావించారు. అయితే 2021 నాటికి ఆ సంస్థలు ఏవి కనిపించడం లేదు. 1989లో ఎలాగైతే ఇన్వెస్ట్ చేశామో ఇప్పుడు కూడా అలానే ఉన్నామని అయితే ప్రపంచం చాలా వేగంగా మారిపోతోందని అది కూడా పలు విధాలుగా మార్పులు వస్తున్నాయని బఫెట్ చెప్పారు.

మొత్తానికి ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా వారెన్ బఫెట్‌ ఆలోచనలో మార్పులు వస్తే తప్ప ప్రస్తుతం అతని కంపెనీపై ఉన్న కన్‌ఫ్యూజన్ తొలిగిపోదని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Berkshire:వారెన్ బఫెట్ టెక్ రంగంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయరు? కారణమిదే..! | Why is Warren Buffet not keen on investing in Technology driven Economy,Know it all

Billionaire Warren Buffet is not showing interest to invest in Technology driven Economy.
Story first published: Saturday, August 7, 2021, 14:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X