భారత్ సహా పదమూడు దేశాల్లో రిటైల్ బిజినెస్ నుండి తప్పుకోవాలని అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ భావిస్తోంది. ఈ వ్యాపారాన్ని విక్రయించేందుకు బయ్యర్ కోసం అన్వేషిస్తోంది. రిటైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, హోమ్ లోన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలు నిర్వహించే ఈ సంస్థ భారత్ నుండి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రిటైల్ వ్యాపార విభాగ విక్రయం పూర్తయ్యే వరకు ప్రస్తుత కస్టమర్లు, ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదని సిటీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

సిటీ బ్యాంకు ఎగ్జిట్.. ఎందుకు
టొరంటో కేంద్రంగా పనిచేసే సిటీ బ్యాంకు వార్షిక లాభాల్లో భారత్‌లోని రిటైల్ వ్యాపారం ద్వారా ఆర్జిస్తోంది చాలా తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో సంస్థ ఆర్జించిన లాభాల్లో రిటైల్ విభాగం వాటా 20 శాతం మాత్రమే. అంతర్జాతీయంగా సంస్థ ఆస్తుల్లో భారత రిటైల్ విభాగం వాటా 1.5 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వ్యాపారం నుండి బయటకు వచ్చి పూర్తి కార్పొరేట్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని సిటీ గ్రూప్ భావిస్తోంది. ఈ విభాగంలో విస్తరణ కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది.

కొనుగోలుకు ఆసక్తి
భారత్ నుండి సిటీ గ్రూప్ నిష్క్రమణ దేశీయ సంస్థలకు మంచి అవకాశంగా చెబుతున్నారు నిపుణులు. సిటీ బ్యాంకుకు క్రెడిట్ కార్డ్ బిజినెస్‌లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థకు కలిగిన కార్డుల్లో ఎక్కువ వరకు ప్రీమియం, కార్పోరేట్ శాలరీ అకౌంట్ కార్డులు. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు రిటైల్ బిజినెస్‌ను కొనుగోలు చేసేందుకు ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి దిగ్గజ బ్యాంకులు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మార్కెట్ వాటా
పదేళ్ల క్రితం సిటీ బ్యాంక్ మార్కెట్ షేర్ ఇరవై శాతంగా ఉంది. ఆ తర్వాత HDFC, SBIలు ఎదిగాయి. దీంతో సిటీ బ్యాంక్ మార్కెట్ షేర్ 4 శాతానికి పడిపోయింది. అయితే బ్యాంకు పోర్ట్‌పోలియో పటిష్టంగా ఉంది. ఒక్కో కార్డుపై ఏటా ఖర్చు చేసే మొత్తంలో 20 శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది ఈ బ్యాంకు కస్టమర్ల ఖర్చు చేసే శక్తికి నిదర్శనం.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications