For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ భారీ పతనం, 52,000 నుండి 43,000 డాలర్లకు...

|

క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మళ్లీ పతనమవుతోంది. ఈ వారం ప్రారంభంలో 52,000 డాలర్లను క్రాస్ చేసిన ఈ క్రిప్టో కింగ్ ఏకంగా 17 శాతం క్షీణించి 43,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అంతకుముందు 52,948 డాలర్లను తాకి నెలల గరిష్టానికి చేరుకున్న బిట్ కాయిన్ ఆ తర్వాత 42,000 స్థాయికి పడిపోయి, ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ 11 శాతం నష్టంతో 46,000 వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడింది. గత నెల రోజులుకు పైగా 40వేల డాలర్లు దాటి, ఇటీవలే 50వేల డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం 51,000 మార్కు దాటిన బిట్ కాయిన్ త్వరలోనే 55,000 దిశగా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు భారీగా పతనమైంది.

బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టోలు కూడా క్షీణించాయి. ఎథేరియం బ్లాక్ చైన్ నెట్ వర్క్ ఎథేర్ 12 శాతం, మీమ్ క్రిప్టో కరెన్సీ డోజీకాయిన్ 16 శాతం పతనమయ్యాయి. ఇటీవలే ఎథేరియం 4000 మార్కు సమీపానికి వచ్చింది. డోజీకాయిన్ 0.31 డాలర్లను తాకింది. కానీ అంతలోనే పడిపోయాయి. బిట్ కాయిన్‌ను చట్టబద్దమైనదిగా స్వీకరించిన వాటిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో లాటిన్ అమెరికన్ దేశం ఎల్ సాల్వెడార్ ఉంది. క్రిప్టో కరెన్సీ పతనమవుతున్నప్పటికీ, చాలామంది ఇప్పటికీ ఆశాజనకంగా ఉన్నారు. బిలియనీర్ మైక్ నోవోగ్రాట్జ్ (గెలాక్సీ డిజిటల్ హోల్డింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్) మాట్లాడుతూ.. గత ఎనిమిది వారాలుగా క్రిప్టో దూసుకెళ్తోందని, అధికంగా కొనుగోలు చేస్తున్నారని, క్రిప్టో మీద పెద్ద సంస్థలు ఇన్వెస్ట్ చేస్తున్నాయని దీంతో వ్యక్తిగత పెట్టుబడిదారుల నుండి ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు.

 Why Bitcoin, other crypto prices are crashing?

సోమవారం ఎల్ సాల్వెడార్ తన మొదటి 400 క్రిప్టో కరెన్సీలను కొనుగోలు చేసింది. దీంతో తాత్కాలికంగా బిట్ కాయిన్ ధర 52,000 డాలర్ల మార్కును దాటింది. కానీ అంతలోనే తిరిగి కుప్పకూలింది. బిట్ కాయిన్ పదిహేడు శాతం పతనం కాగా, పోల్కాడాట్, బియాన్స్ కాయిన్ 20 శాతం మేర క్షీణించాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 11 శాతం క్షీణించి 2.11 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. కేవలం XRP మాత్రమే లాభపడింది.

ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ

- Bitcoin BTC - $46,485.93 - 11.71 శాతం డౌన్

- Ethereum ETH - $3,434.09 - 12.21 శాతం డౌన్

- Cardano ADA - $2.46 - 12.94 శాతం డౌన్

- Binance Coin BNB - $413.36 - 16.58 శాతం డౌన్

- Tether USDT - $1.00 - 0.04 శాతం జంప్

- XRP - $1.10 - $19.54 శాతం జంప్

- Dogecoin - $0.25 - $16.33 శాతం డౌన్

- Polkadot DOT - $27.73 - 19.74 శాతం డౌన్

- USD Coin USDC - $0.99 - 0.03 శాతం జంప్

- Solana SOL - $173.12 - $0.18 శాతం డౌన్

English summary

బిట్ కాయిన్ భారీ పతనం, 52,000 నుండి 43,000 డాలర్లకు... | Why Bitcoin, other crypto prices are crashing?

Bitcoin, Ethereum and Dogecoin are among the cryptocurrencies that have seen a steep price volatility in the last few days. Bitcoin’s price tumbled more than 17 percent to $43,000 before paring some losses to trade down over 11 percent at $46,000.
Story first published: Wednesday, September 8, 2021, 22:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X