For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Russia ukraine war: నూనెలు మాత్రమే కాదు, 14 ఏళ్ల గరిష్టానికి గోధుమ ధరలు

|

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోధుమ ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో సరఫరా కొరత భయాలతో 2008 తర్వాత మొదటిసారి భారీగా పెరిగాయి. ఉక్రెయిన్ నుండి ప్రపంచంలోని వివిధ దేశాలకు 25 శాతం గోధుమలు ఎగుమతి అవుతాయి. బ్రెడ్ నుండి కుకీస్, నూడుల్స్ వరకు ప్రతి దానిలో ఉపయోగించే ప్రధాన ఆహారం గోధుమలు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఉక్రెయిన్ పైన రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ దేశాలు మాస్కో పైన భారీ ఆంక్షలు విధించాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రధాన నౌకాశ్రయాలను నిలిపివేసింది. లాజిస్టిక్స్, రవాణా సంబంధాలు తెగిపోయాయి. యుద్ధం వల్ల రానున్న రోజుల్లో గోధుమ పంట పండే అవకాశాలు కూడా సన్నగిల్లాయి.

.

అందుకే ధరలు మరింత పెరుగుతున్నాయ్

అందుకే ధరలు మరింత పెరుగుతున్నాయ్

రష్యా, ఉక్రెయిన్ దేశాలు వివిధ దేశాలకు పెద్ద ఎత్తున మొక్కజొన్న, బార్లీ, సన్ ఫ్లవర్ ఆయిల్‌ను సరఫరా చేస్తాయి. 2012 నుండి మొక్కజొన్న ధరలు ఇప్పుడు అత్యధికంగా పెరిగింది. సోయాబీన్ ఆయిల్, పామాయిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కజొన్న, సోయాబీన్ దిగుమతిదారు చైనా. అలాగే, గోధుమలను కొనుగోలు చేసే దేశం కూడా చైనా. ఈ దేశం తమకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవడం కోసం పావులు కదుపుతోంది. ఇది ధరలను మరింత పెరగడానికి కారణమవుతోంది.

పద్నాలుగేళ్ల గరిష్టానికి

పద్నాలుగేళ్ల గరిష్టానికి

సరఫరా భయాలు మరింతగా పెరగడంతో గోధుమలు తాజాగా పద్నాలుగేళ్ల గరిష్టస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం చికాగోలో గోధుమ ఫ్యూచర్ ఎక్స్చేంజ్ పరిమితితో 6.6 శాతం పెరిగి 12.09 డాలర్లకు చేరుకుంది. ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆహార ద్రవ్యోల్భణంపై ఒత్తిడి పెంచడం, యుద్ధం, ఆంక్షలు వంటి వివిధ అంశాల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలం ప్రభావం చూపకుండా రేట్లను ఎంత వరకు పెంచవచ్చుననే అంశంపై సెంట్రల్ బ్యాంకులు గందరగోళంలో పడ్డాయి.

అప్పుడు మరింత పెరగవచ్చు

అప్పుడు మరింత పెరగవచ్చు

బ్లాక్ సీ ఎగుమతులు లాక్ చేయబడితే అత్యంత బుల్ దృష్టాంతంలో ధరలు 14 డాలర్లు లేదా 14.50 డాలర్లకు పెరగవచ్చునని సిటీ గ్రూప్ ఇంక్ పేర్కొంది. చికాగో ఫ్యూచర్ మే 2020 నుండి అత్యధిక స్థాయికి చేరుకోవడంతో బియ్యం కూడా గందరగోళంగా ఉంది. ఎక్కువగా దిగుమతులు చేసుకునే దేశాలకు ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. చైనీస్ కొనుగోలుదారులు ఇటీవల అమెరికా సోయాబీన్ 20 కార్గోలు, దాదాపు 10 మొక్కజొన్న సరుకులను బుక్ చేశారు కార్న్ ఫ్యూచర్స్ ఈ వారం 17 శాతం పెరిగింది. 2008 నుండి ఇదే అతిపెద్ద వారపు లాభం. ప్రపంచంలోని అగ్రశ్రేణి గోధుమ ఎగుమతిదారుల్లో అర్జెంటీనా

English summary

Russia ukraine war: నూనెలు మాత్రమే కాదు, 14 ఏళ్ల గరిష్టానికి గోధుమ ధరలు | Wheat spikes to fresh 14 year high on deepening global shortage fears

Wheat soared to the highest level since 2008 on mounting fears of a global shortage as the Ukraine war shuts off over 25% of the world’s exports of the staple used in everything from bread to cookies and noodles.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X