For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో వాట్సాప్ సరికొత్త ఫీచర్, లాగ్-అవుట్ కావొచ్చు

|

మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ పైన వర్క్ చేస్తోంది. వాట్సాప్ వినియోగదారుల విశ్వాసాన్ని మరింత పెంచడంతో పాటు సరికొత్త, ఫ్యాన్సీ అనుభూతి కోసం ఫీచర్స్ పైన పని చేస్తోంది. తాజాగా వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వస్తోంది. వినియోగదారుడు ఈ మెసేజింగ్ ప్లాట్ ఫాం నుండి బ్రేక్ తీసుకోవచ్చు. ఇటీవల కొత్త ప్రైవసీ పాలసీతో వినియోగదారుల ఆగ్రహానికి గురైన వాట్సాప్ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతమున్న డిలీట్ మై అకౌంట్ స్థానంలో కొత్తగా లాగ్-అవుట్ అనే ఫీచర్ తీసుకు వస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇతర పరికరాలలో వాట్సాప్ లాగ్-అవుట్ చేయడం మరిచిపోతే ఈ ఫీచర్‌‌తో ఎక్కడి నుండైనా లాగ్-అవుట్ చేయవచ్చు. ఇందుకు సంబందించిన ఒక వీడియోను వాట్సాప్ తన బ్లాగ్‌లో షేర్ చేసింది. మ్యూట్ ఫీచర్‌ను‌ కూడా తీసుకొని వస్తోంది. వేరే యూజర్లకు వీడియో, క్లిప్‌ను పంపించడానికి ముందు మ్యూట్ చేసి పంపవచ్చు. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్‌తో వీడియో ఎడిట్, టెక్స్ట్ ఎడిటి, ఎమోజీ మొదలైనవి చేయవచ్చు.

 WhatsApp log out feature likely to come soon

వాట్సాప్ యూజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీడివైజ్ సపోర్ట్ ఫీచర్‌ను ఇప్పటికే ఆండ్రాయిడ్ యూజర్లకి‌ బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఐఓఎస్‌ యూజర్లకు బీటా వెర్షన్‌ను విడుదల చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వాట్సాప్ ఖాతా ఉపయోగిస్తోన్న ఫోన్ పనిచేయకపోయినా మరో ఫోన్‌లో వాట్సాప్ యాక్సె‌స్ చేసుకోవచ్చు. వేర్వేరు డివైజ్‌లలో ఒకేసారి వాట్సాప్‌ను కనెక్ట్‌ చేసుకోవచ్చు.

English summary

త్వరలో వాట్సాప్ సరికొత్త ఫీచర్, లాగ్-అవుట్ కావొచ్చు | WhatsApp log out feature likely to come soon

WhatsApp is now reportedly working on several new features and updates to gain trust of its users as well as give them something that is new and fancy. According to a report, WhatsApp is coming up with a new feature that allows a user to take a break from the messaging platform.
Story first published: Wednesday, February 17, 2021, 22:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X