వాట్సాప్ కొత్తగా షాపింగ్ బటన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ అందించే వస్తువులు, సేవలకు సంబంధించిన వివరాల్ని ప్రజలు ఈజీగా తెలుసుకునేలా ఇది దోహదపడుతుంది. వాట్సాప్ బిజినెస్ ఖాతాలకు రోజు 17.5 కోట్ల మంది ప్రజలు సందేశాలు పంపిస్తున్నారు. ప్రతి నెల వ్యాపార కేటలాగ్‌లను 4 కోట్ల మందికి పైగా వీక్షిస్తున్నారు. ఇందులో భారతీయులు 30 లక్షల మందికి పైగా ఉన్నారు.
అందుకే కస్టమర్లకు షాపింగ్ సౌలభ్యాన్ని సులభతరం చేయాలని వాట్సాప్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాయిస్ కాల్ బటన్ స్థానంలో కొత్తగా షాపింగ్ బటన్‌ను చేర్చారు. దీంతో వాయిస్ కాల్ బటన్ కోసం కస్టమర్లు కాల్ బటన్‌ను ఎంచుకొని, అందులో వాయిస్ లేదా వీడియో కాల్ ఎంపిక చేసుకోవాలి.

పరీక్షించి.. నిన్నటి నుండి అందుబాటులోకి
వాట్సాప్ ఇప్పటికే మెసేజ్, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీస్ అందిస్తోంది. తాజాగా బిజినెస్ అకౌంట్లకు షాపింగ్ బటన్‌ను జోడించడం గమనార్హం. దీని ద్వారా కంపెనీలు, విక్రేతలు అందించే వస్తు, సేవల జాబితాను ఒకే క్లిక్ ద్వారా చూడవచ్చు. కొంతకాలంగా ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. నవంబర్ 10వ తేదీ నుండి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా పదిహేడున్నర కోట్ల మంది యూజర్లు బిజినెస్ అకౌంట్లకు సందేశాలు పంపిస్తున్నట్లు వాట్సాప్ కూడా తెలిపింది.

జాబితా చూడగలిగితే వస్తువుల కొనుగోలుకు సిద్దం
ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ కేటలాగ్‌ను 4 లక్షలమంది వీక్షిస్తుండగా, ఇందులో ముప్పై లక్షలమంది భారతీయులు ఉన్నారు. జాబితాను చూడగలిగితే వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధమని ఇటీవల భారత్‌లో నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది వెల్లడించారు. ఇలాంటి కస్టమర్లు సులువుగా కొనుగోళ్ళు జరిపేందుకు వీలుగా కొత్త షాపింగ్ బటన్‌ను జోడించినట్లు వాట్సాప్ తెలిపింది. కంపెనీలు, విక్రేతలు తమ వాట్సాప్ బిజినెస్ అఖౌంట్లకు కేటలాగ్‌ను జోడిస్తే సాధారణ కస్టమర్లు ఈ బటన్ వీక్షించవచ్చు.

వాట్సాప్ పే కూడా..
వాట్సాప్ పే కూడా భారత్‌లోకి వచ్చింది. ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్‌కు చెందిన పేమెంట్ యాప్‌కు ఎన్సీపీఐ నుండి ఆమోదం లభించింది. 2018లోను వాట్సాప్ పే తీసుకు రావడానికి ఎన్సీపీఐ వద్దకు వెళ్లింది. రెండేళ్ల తర్వాత ఆమోదం పొంది, పేమెంట్ యాప్‌ను తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారా డబ్బులు పంపించవచ్చు, పొందవచ్చు. యూజర్లు బ్యాంకు అకౌంట్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications