ఒకవేళ క్రిప్టో కరెన్సీలను భారతదేశం బ్యాన్ చేస్తే... ఒక దేశంగా మనం ఏం కోల్పోతాము?
ఈ మధ్యకాలంలో చాలామంది బిట్‌కాయిన్ మరియు క్రిప్టో కరెన్సీ పేర్లని వినే ఉంటారు. చాలామంది ఈ పేర్లను చాలా విరివిగా వాడుతున్నారు కూడా. బిట్‌కాయిన్ మరియు క్రిప్టోకరెన్సీలు 2009లో ప్రారంభమైనప్పటికీ.. జన బాహుళ్యంలోకి వచ్చింది మాత్రం ఈ మధ్యకాలంలోనే. సాధారణంగా గతంలో ఈ పదాలు టెక్ ప్రియుల బజ్‌వర్డ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు అది పెట్టుబడులను కాపాడటం కోసం ఒక సంక్షిప్త ఆస్తిగా మారింది. గతంతో పోలిస్తే... క్రిప్టో కరెన్సీల స్వీకరణ ధరలు మరియు వాటి వినియోగం గణనీయంగా పెరిగింది. మరీ ముఖ్యంగా ధరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. దీని కారణం... టెస్లా, ఫేస్‌బుక్, పేపాల్, వీసా, మాస్టర్‌కార్డ్, మరియు JP మోర్గాన్ వంటి వాల్ స్ట్రీట్ స్టాల్‌వార్ట్‌లు క్రిప్టో కరెన్సీ యొక్క టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నారు. దీనిద్వారా రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ని శాసించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రిప్టో కరెన్సీ ఎలా ఉందంటే... భారతదేశంలో కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న డయల్-అప్ కనెక్షన్‌లా ఉన్నాయి. అయితే ప్రజలు సమాచారం తెలుసుకునేందుకు ఇంటర్నెట్ ఎలా అయితే వినియోగించడం మెల్లిమెల్లిగా నేర్చుకున్నారో... అదే విధంగా ఈ క్రిప్టో కరెన్సీ గురించి కూడా తెలుసుకుంటారు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీనే కదిలించే శక్తి సామర్థ్యాలు ఈ క్రిప్టో కరెన్సీకి ఉన్నాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి, ఈ భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనాలున్నాయి. ఉదాహరణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్‌లో చైనా ఎలా అయితే ఆధిపత్యం సంపాదించిందో... అలా భారతదేశం కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం.. క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టడం భారతదేశంలో చట్టబద్ధమైనది. అయితే ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక నియంత్రణ విధానాన్ని పరిశీలిస్తోంది. దీనివల్ల మేము ఈ రంగంలో ఇప్పటివరకు కేవలం ప్రేక్షకులుగానే ఉండిపోయాము. నిషేధానికి వ్యతిరేకంగా నిపుణుల సలహాలను భారత ప్రభుత్వం పాటిస్తుందని మేము నమ్ముతున్నాం. ఒకవేళ అది నిజంగా జరిగితే భారత్ కోల్పోయే అనేక వినియోగ కేసులను ఇక్కడ మేము ప్రస్తావించబోతున్నాము.

కరెన్సీ మరియు పెట్టుబడులు:
ప్రపంచ వాణిజ్యం మొత్తం కలిసి వికేంద్రీకృత కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌కు మారితే డాలర్‌పై భారతదేశం ఆధారపడటం తగ్గిపోతుంది. దేశం మరియు దాని ఎగుమతి-ఆధారిత కంపెనీలు వ్యాపారం మరియు చెల్లింపులకు సంబంధించి మెరుగైన అంచనాను కలిగి ఉంటాయి. క్రిప్టో కరెన్సీలను స్వీకరిస్తే ఈ రంగాలకు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. తద్వారా ఇది విదేశీ పెట్టుబడులను స్వీకరించే మార్గాన్ని మరింత సులభతరం చేస్తుంది.
అంతేకాకుండా... చారిత్రాత్మకంగా చూసినా కూడా... యుఎస్ ఆధారిత స్టాక్స్ మరియు చాలా ఉత్పత్తులు భారతీయ పెట్టుబడిదారులకు అందుబాటులో లేవు. ఇటీవలి కాలంలో సంప్రదాయ ఆస్తుల పనితీరు తక్కువగా ఉన్నందున, సాధారణ పెట్టుబడిదారులకు బిట్‌కాయిన్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ పెట్టుబడిగా పనిచేస్తుంది. దీనివల్ల క్రిప్టోకరెన్సీలు ఆయా దేశాల కరెన్సీతో సంబంధం లేకుండా... సంపదను పెట్టుబడి పెట్టడానికి మరియు వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పెట్టుకునేందుకు పెట్టుకునేందుకు ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పడుతుంది.

డీసెంట్రలైజ్‌డ్ ఫైనాన్స్ (DeFi):
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే... బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సేవింగ్స్, లెండింగ్, చెల్లింపులు మరియు ఇతర ట్రేడింగ్ వంటి అనేక ఆర్థిక పరిష్కారాలను అందిస్తుంది. అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం అధిక పారదర్శకతను అందించే డిసెంట్రలైజ్‌డ్ ఎకో సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. అందువల్ల ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సవాలు చేయడం ప్రారంభించింది. 'కనీస ఖాతా బ్యాలెన్స్' మరియు లావాదేవీల అధిక రుసుము నిర్మాణాన్ని తిరస్కరించడం లాంటి అవసరాలను మినహాయించడం ద్వారా ఆర్థిక చేరికను సాధించడంలో సహాయపడటమే డిఫై ప్రాజెక్ట్‌ల అసలు లక్ష్యం.
ఇక అన్నింటికి మించి... డీసెంట్రలైజ్‌డ్ ఫైనాన్స్ సంప్రదాయ ఫైనాన్స్‌ని పూర్తిగా మార్చివేస్తుందని.... దీనివల్ల భారతదేశంలో అసలు అక్కౌంట్ లేని 190 మిలియన్ల మందికి ఎంతగానో ప్రయోజనాన్ని చేకూరుస్తుందని మేము నమ్ముతున్నాము.

డేటా మరియు ఇన్నోవేషన్:
గూగుల్, ఫేస్‌బుక్ లేదా ఉబెర్ వంటి కంపెనీలు మార్కెట్‌లోని కొత్త ఎంట్రీలపై తమ ఎడ్జ్‌ని కాపాడుకోవడానికి కస్టమర్ల డేటాను తరచుగా ఉపయోగిస్తాయి. అదే సమయంలో వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాయి. అయితే ఇప్పుడు ఈ బ్లాక్ చైయిన్ టెక్నాలజీ ద్వారా సాధారణ పబ్లిక్ డేటాబేస్‌లో డేటాను నిల్వ చేయడం చాలా సురక్షితంగా జరుగుతుంది.
టాక్సీ డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఆదాయంలో ఎలాంటి వాటా తీసుకోని ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్ (Ethereum వంటివి) పైన నిర్మించిన టాక్సీ సేవను ఒక్కసారి ఊహించుకోండి. ఎంత అద్భుతంగా ఉందో కదా. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశం కోసం.. ఇలాంటి ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకులను కచ్చితంగా ప్రోత్సహించాలి.

ప్రజలు మరియు కంపెనీలు:
క్రిప్టోకరెన్సీలు మరియు బ్లాక్‌చెయిన్ వల్ల భారతదేశం లాంటి దేశంలో జరిగే మరో ప్రయోజనం.... అత్యంత నైపుణ్యం కలిగిన యువతకు అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు వస్తాయి. ఉదాహరణకు, భారతదేశ పోలీగాన్ (మ్యాటిక్ నెట్‌వర్క్) బ్లాక్‌చెయిన్ ఆధారిత నెట్‌వర్క్‌లను అనుసంధానించడానికి ఒక ప్రోటోకాల్ మరియు ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది. అంతేకాకుండా ఇథేరియమ్ యొక్క నెట్‌వర్క్ సమస్యలను అధిగమించడానికి మరియు వీసా లావాదేవీల సంఖ్యకు సరిపోయేలా క్రిప్టోకరెన్సీలను తీసుకురావడానికి బలమైన పోటీదారుగా అవతరించింది.యూఎస్- ఆధారిత క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ అయినటువంటి కాయిన్‌బేస్‌ని నాస్‌డాక్ లిస్ట్ చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ భారతదేశంలో హైదరాబాద్ నుంచి IT సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. కాయిన్‌బేస్ 100 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. అదే సమయంలో, భారతదేశం ఆధారిత ఎక్స్ఛేంజీలు మరియు కంపెనీలు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవ్వలేవు. ఎందుకంటే మన ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో ఉన్నప్పటికీ వాటి నియంత్రణపై ఎలాంటి స్పష్టత లేదు.
ఓవరాల్‌గా క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తే ఒక దేశంలో భారతదేశం ఎంతో కోల్పోతుంది. అన్నింటికి మించి బ్లాక్‌చెయిన్ మరియు క్రిప్టోకరెన్సీలు భారతీయ ఆత్మ నిర్భర్ సాధనకు ఒక ఇంధనంలా పనిచేస్తాయి. అందువల్ల, పర్యావరణ వ్యవస్థలోని వస్తువులను చట్టవిరుద్ధం చేయడం కంటే గుర్తించడం మరియు నియంత్రించడం ద్వారా భారతదేశంలో వికేంద్రీకృత క్రిప్టోగ్రఫీ-ఆధారిత వ్యవస్థలను గమనించడం చాలా సులభం. అందువల్లే ముందుగా స్పష్టత కోసం మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాము.
- రచయిత-విక్రమ్ సుబ్బురాజ్, సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు, జియోటస్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్