For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచం సాధారణస్థితికి ఎప్పుడు వస్తుందంటే: బిల్‌గేట్స్ ఏం చెప్పారు

|

కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి సాధారణ పరిస్థితికి రావొచ్చునని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అన్నారు. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పేద దేశాలకు అందుబాటులోకి రావడం, వ్యాక్సీన్ తక్కువ ధరకు వచ్చేలా చూడటం అవసరం. కరోనా పరిశోధనల కోసం ఇప్పటికే భారీ విరాళం ఇచ్చిన బిల్ గేట్స్ తాజాగా మరింత ప్రకటించారు. మరో 250 మిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇస్తున్నట్లు గురువారం బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. కరోనాపై పోరు కోసం పరిశోధనలు చేసేందుకు 1.75 బిలియన్ డాలర్ల మేర అందించారు.

80% విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారికి మాత్రం ఒక ఏడాది వేతన పెంపు ఆగిపోయినట్లే!80% విప్రో ఉద్యోగులకు గుడ్‌న్యూస్, వారికి మాత్రం ఒక ఏడాది వేతన పెంపు ఆగిపోయినట్లే!

అందరికీ వ్యాక్సీన్

అందరికీ వ్యాక్సీన్

తాజాగా 250 మిలియన్ డాలర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడారు. 2022లో ప్రపంచం సాధారణ స్థితికి రావొచ్చునన్నారు. అందరికీ కరోనా వ్యాక్సీన్ అందించేందుకు, పేద దేశాలకు సరసమైన ధరలకు ఇచ్చేందుకు తద్వారా ప్రపంచం తిరిగి సాధారణ పరిస్థితికి వచ్చేందుకు వ్యాక్సీన్ అలయెన్స్ కోవాగ్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బిల్ గేట్స్‌కు జీవనకాల సాఫల్య అవార్డు

బిల్ గేట్స్‌కు జీవనకాల సాఫల్య అవార్డు

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌కు టై-గ్లోబల్ జీవితకాల సాఫల్య అవార్డు లభించింది. టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్ వ్యవస్థ, ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గాను గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, వ్యాపార, పోటీ వ్యూహాలతో బిల్ గేట్స్ ప్రపంచ అతిపెద్ద సాఫ్టువేర్ వ్యవస్థను స్థాపించారు. భారత ఐటీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా ఎఫ్‌సీ కోహ్లీకి లైఫ్ టైమ్ సర్వీస్ టు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ అవార్డును ప్రకటించారు. ఆయన మరణానంతరం ప్రకటించడంతో కోహ్లీ తరఫున భార్య స్వీకరించారు.మరిన్ని విభాగాల్లోను టై-గ్లోబల్ అవార్డు ఇచ్చింది.

బిల్‌గేట్స్ ఏమన్నారంటే

బిల్‌గేట్స్ ఏమన్నారంటే

ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో, అధికోత్పత్తి సాధనలో, కరోనాను అరికట్టడంలో పరిశోధన కీలకమన్నారు. ప్రపంచాన్ని వణికించే జబ్బుల నుండి రక్షణ మార్గాలు పరిశోధనల ద్వారానే లభిస్తాయన్నారు. క్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి ఇన్నోవేషన్ కీలకమని, మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించే సమయంలో తాను, తన భాగస్వామి దీనినే విశ్వసించామన్నారు. క్రియేటివిటీ మెరుగైన సమాజాన్ని నిర్మిస్తుందని చెప్పారు.

English summary

ప్రపంచం సాధారణస్థితికి ఎప్పుడు వస్తుందంటే: బిల్‌గేట్స్ ఏం చెప్పారు | We may be back to normal in 2022: Bill Gates

The Bill and Melinda Gates Foundation said on Thursday it had pledged $250 million in additional funding towards the global campaign to fight the coronavirus pandemic.
Story first published: Friday, December 11, 2020, 9:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X