For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2సార్లు వడ్డీ కోత.. ఇక ఆర్బీఐ ఏం చేయగలదంటే..: కరోనా అస్త్రాలపై శక్తికాంతదాస్

|

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు ఉన్నాయని, అవసరాన్ని బట్టి వాటిని ప్రయోగిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆయన గురువారం ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన వెబినార్ మీటింగ్‌లో మాట్లాడారు. కరోనా సహాయక చర్యలను నిలిపివేసేందుకు ఆర్బీఐకి ఎలాంటి ఆతృత లేదన్నారు. రెపో రేటును యథాతథంగా ఉన్నంత మాత్రాన అస్త్రాలు అయిపోయాయని అనుకోవద్దని, గత పరపతి సమీక్షలో అలాగే ఉంచడం కూడా వాటిని సిద్ధం చేసుకోవడానికేనని తెలిపారు.

రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే!రూ.2,000 నోట్ల 'వ్యాల్యూ' క్రమంగా తగ్గింది, నకిలీ నోట్లు ఎన్ని అంటే!

రెండుసార్లు ఆర్బీఐ వడ్డీ కోత.. ఇక ఏం చేయగలదంటే..

రెండుసార్లు ఆర్బీఐ వడ్డీ కోత.. ఇక ఏం చేయగలదంటే..

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే రెండుసార్లు వడ్డీ రేట్లలో కోతలు విధించిందని, ఇక ఏం చేయగలదని అడిగిన ప్రశ్నకు శక్తికాంత దాస్ సమాధానం చెప్పారు. ఆర్బీఐ వద్ద మరిన్నిఅస్త్రాలు ఉన్నాయని, గత సమీక్షలో వడ్డీ రేట్లు అలాగే ఉంచినంత మాత్రాన అవకాశాలు లేవని భావించవద్దని, అవసరమైన సమయంలో అస్త్రాలు బయటకు తీస్తామన్నారు. కీలక వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో రణ వ్యయాలు తగ్గాయన్నారు. ద్రవ్యోల్భణం పెరిగేంత వరకు వడ్డీ రేట్ల కోత చేశామని, ఇప్పటికీ సర్దుబాట ధోరణిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలా భవిష్యత్తులో రేట్ల కోతకు అవకాశాలు ఉంచుకున్నట్లు చెప్పారు. తద్వారా అవసరమైతే భవిష్యత్తులో మరింత వడ్డీ రేటు కోత ఉంటుందని భావిస్తున్నారు.

మార్కెట్‌ను ఆశ్చర్యపరిచే నిర్ణయాలు

మార్కెట్‌ను ఆశ్చర్యపరిచే నిర్ణయాలు

కరోనా అనంతరం వృద్ధి, ద్రవ్యోల్భణం అంచనాలను చెప్పగలమన్నారు. వృద్ధి అంటే మన దేశ అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా అస్థిర పరిస్థితుల్లో ఉందని, స్పష్టత వచ్చాక చెప్పవచ్చునన్నారు. ఇప్పుడు ఏదో రకంగా సంఖ్య, ఇచ్చేసి సవరించడం సరికాదన్నారు. ఆర్బీఐ ఎప్పుడూ అంచనాక అందని విధంగా ఉండి, మార్కెట్‌ను ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. తాము ఏ సమాచారాన్ని దాచడం లేదని స్పష్టం చేశారు.

ఆర్థికరంగం బలంగా ఉంది

ఆర్థికరంగం బలంగా ఉంది

2009-10లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా ప్రభావం మన దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ఉందన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగం బలంగా ఉందని చెప్పారు. జీడీపీలో రుణనిష్పత్తి మెరుగుపడడం, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం స్థూలంగా అదుపులోనే ఉండడం, కరెంట్ అకౌంట్ లోటు మెరుగ్గా ఉన్నాయని గుర్తు చేశారు. మున్ముందు కూడా ఆర్థిక రంగం స్థిరంగానే ఉంటుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో మాత్రం మరిన్ని సంస్కరణలు అసరమని చెప్పారు.

కేంద్రం తీరు భేష్

కేంద్రం తీరు భేష్

కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీరు ప్రశంసనీయంగా ఉందని శక్తికాంత దాస్ అన్నారు. తాను ప్రభుత్వం వైపు మాట్లాడటం కాదని, ఆర్బీఐలో ఉన్నందున... ఓ పరిశీలకుడిగా ప్రభుత్వ చర్యలు చాలా వివేకవంతమైనవిగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు స్థిరీకరణ వ్యూహం కూడా ఆహ్వానించదగ్గది అన్నారు. ఎక్కువ బ్యాలెన్స్ షీట్లు ఉన్న బ్యాంకులు ప్రజలకు మేలు చేస్తాయన్నారు. అప్పుడే అంతర్జాతీయ బ్యాంకులతో పోటీ పడతాయన్నారు. బ్యాంకుల విలీన వ్యూహం కూడా హర్షణీయమన్నారు.

English summary

2సార్లు వడ్డీ కోత.. ఇక ఆర్బీఐ ఏం చేయగలదంటే..: కరోనా అస్త్రాలపై శక్తికాంతదాస్ | We have not exhausted our ammunition yet: RBI Governor Shaktikanta Das

RBI Governor Shaktikanta Das on Thursday cautioned banks that being extreme risk averse will be self defeating and that lenders will not be able to win their bread if they do not carry out their basic task.
Story first published: Friday, August 28, 2020, 7:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X