For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారా ?అయితే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాజా వడ్డీ రేట్లు ఇవే

|

గతేడాది కరోనా మహమ్మారి విసిరిన పంజా నుండి సామాన్యులు ఇంకా కోలుకోలేదు . సామాన్య, మధ్యతరగతి ప్రజలు నేటికీ ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతూనే ఉన్నారు . తమ ఆర్ధిక అవసరాలను తీర్చుకోవటానికి తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. కష్టకాలంలో బ్యాంకులు సాధ్యమైనంతగా ప్రజలకు రుణాలిచ్చి ఆదుకోవాలని ఆర్బిఐ చేసిన సూచనల మేరకు బ్యాంకులలోతక్కువ వడ్డీ రేట్లకు బంగారంపై రుణాలు ఇస్తున్నారు. ప్రస్తుతం గతంతో పోల్చితే ఇప్పుడు బంగారంపై రుణాలు తీసుకునే వారు చాలావరకు పెరిగారు.

బ్యాంకులలో బంగారు రుణాలపై తక్కువ వడ్డీరేట్లు

బ్యాంకులలో బంగారు రుణాలపై తక్కువ వడ్డీరేట్లు

ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కడానికి బంగారంపై రుణాల కోసం పరుగులు పెడుతున్నారు మధ్య తరగతి ప్రజలు. ఇక అలాంటి వారు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది . అటు ప్రభుత్వ రంగ బ్యాంకులలోనే కాకుండా,ప్రైవేటు బ్యాంకులు కూడా కాస్తో కూస్తో వడ్డీ తక్కువగా ఉండటంతో అందరూ బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. బంగారంపై రుణాలను అతి తక్కువ వడ్డీకే ప్రభుత్వ రంగ బ్యాంకులు గోల్డ్ లోన్ మేళాలు నిర్వహించి మరీ ఇస్తుండడంతో చాలామంది బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు.

కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా వడ్డీ రేట్లు

కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా వడ్డీ రేట్లు

వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్ల కంటే, బంగారంపై రుణాలకు ఇచ్చే వడ్డీ రేట్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. బంగారం పై ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి . బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్లను తాకట్టుపెట్టి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలను పొందవచ్చు. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి . వడ్డీ రేట్లు బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు వేరు వేరుగా ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల కంటే , బ్యాంకు లలోనే బంగారం పై రుణాల వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఇక తక్కువ వడ్డీకే బంగారు రుణాలు ఇస్తున్న ఫైనాన్స్ సంస్థలు మరియు బ్యాంకుల్లో ఉన్న వడ్డీ రేట్లు ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి.

వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలలో తాజా వడ్డీ రేట్లు ఇవే

వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలలో తాజా వడ్డీ రేట్లు ఇవే

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 7 %,

బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35 % ,

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.50 %,

కెనరా బ్యాంక్ 7.65 % ,

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.25%,

కర్ణాటక బ్యాంక్ 8.38 %,

ఇండియన్ బ్యాంక్ 8.50 %,

యూకో బ్యాంక్ 8.50 %,

ఫెడరల్ బ్యాంక్ 8.50 %,

యూనియన్ బ్యాంక్ 8.85 %,

జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 8.90 %,

సెంట్రల్ బ్యాంక్ 9.05 %,

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 9.25 %,

హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ 9.50 %,

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.60% ,

బ్యాంక్ ఆఫ్ బరోడా 9.60%

ఎస్ బ్యాంక్ 9.99 %,

ఐసిఐసిఐ బ్యాంక్ 10 %,

ఇండస్ఇండ్ బ్యాంక్ 10 %,

కోటక్ మహేంద్ర బ్యాంక్ 10.50% ,

ముత్తూట్ ఫైనాన్స్ 11.99% ,

మణప్పురం ఫైనాన్స్ 12%,

యాక్సిస్ బ్యాంక్ 13% గా ఉన్నాయి .

English summary

గోల్డ్ లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారా ?అయితే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాజా వడ్డీ రేట్లు ఇవే | Want To take gold loans ? then, know about the latest interest rates

The interest rates on loans on gold are very different than the interest rates on personal loans. The interest rates on finance companies and banks, which lend gold at low interest rates, are currently as follows.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X