For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కర్నూలువాసులకు గుడ్‌న్యూస్, వాల్‍‌మార్ట్ 28న హోల్‌సేల్ స్టోర్ ప్రారంభం

|

కర్నూలు: అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నవ్యాంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో స్టోర్‌ను ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ స్టోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఔట్ లెట్ల సంఖ్య 28కి చేరుకుంది. కంపెనీ సభ్యులు, పార్ట్‌నర్స్, అసోసియేట్స్, వాటాదారుల నుంచి విశేష స్పందన నేపథ్యంలో వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నట్లు వాల్ మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ తెలిపారు. ఇందులో భాగంగా కర్నూలులో ఔట్ లెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఏపీలో ఏ బస్సుకు ఎంత ఛార్జ్ పెరిగింది, ఆ బస్సులో పెరగలేదుఏపీలో ఏ బస్సుకు ఎంత ఛార్జ్ పెరిగింది, ఆ బస్సులో పెరగలేదు

ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన అయిదో స్టోర్. ఇది వరకు గుంటూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నంలో స్టోర్స్ ఏర్పాటు చేసింది. వాల్ మార్ట్ శాఖ ఏర్పాటు సంతోషకరమని, దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అన్నారు.

Walmart opens 28th wholesale store at Kurnool in Andhra Pradesh

చిన్న వ్యాపారులకు సహాయపడే విధంగా తాము క్యాష్ అండ్ క్యారీ నెట్ వర్క్ స్టోర్స్‌ను పెంచుకుంటున్నామని క్రిష్ అయ్యర్ తెలిపారు. ఇందుకు అందరి నుంచి మంచి మద్దతు లభిస్తోందన్నారు. వివిధ రకాల పండ్లు, కూరగాయలు నేరుగా రైతులు, అగ్రికల్చరల్ యూనిట్స్ నుంచి వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తమకు చాలా ముఖ్యమైన సోర్సింగ్ ప్రాంతమన్నారు.

English summary

కర్నూలువాసులకు గుడ్‌న్యూస్, వాల్‍‌మార్ట్ 28న హోల్‌సేల్ స్టోర్ ప్రారంభం | Walmart opens 28th wholesale store at Kurnool in Andhra Pradesh

Walmart India, the wholly owned subsidiary of Walmart Inc, on Wednesday opened its 28th wholesale store' in the country at Kurnool in Andhra Pradesh.
Story first published: Thursday, December 12, 2019, 11:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X