AGR బకాయిల చెల్లింపుల అంశంపై వొడాఫోన్ ఐడియా మరోసారి తన అశక్తతను వెల్లడించింది. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు ఉపశమనం కల్పించాలని లేదంటే మూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా గతంలో హెచ్చరించింది. ఆ తర్వాత రూ.2500 కోట్లు చెల్లించింది. అయితే తాజాగా మరోసారి పూర్తి బకాయిల చెల్లింపు తమ వల్ల ఇప్పుడైతే కాదని టెలికం విభాగానికి లేఖ రాసింది. అంతేకాదు వివిధ డిమాండ్లు ఉంచింది.

కస్టమర్లపైకి భారం..
ఈ లేఖ ద్వారా తమ ఆర్థిక కష్టాల భారాన్ని కస్టమర్లపై మోపేందుకు టెలికం కంపెనీలు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి డేటా, ఔట్ గోయింగ్ కాల్స్‌కు కనీస చార్జీలు నిర్ణయిస్తే తప్ప మనుగడ కష్టమని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరింది.

పలు డిమాండ్లు..
ఈ విజ్ఞప్తికి అనుమతి లభిస్తే మొబైల్ టెలికాం సేవల కస్టమర్లు జేబులకు భారీగా చిల్లు పడే అవకాశాలు ఉంటాయి. టెలికాం కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) కూడా ఇలాంటి డిమాండ్లతో డాట్‌కు లేఖ రాసింది.

ప్లోర్ ధరల విధానం అమలు చేయాలి
తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వడం, ప్లోర్ ధరల విధానాన్ని వెంటనే అమలు చేయడం వంటివి కోరింది. కొత్తగా గ్యారెంటీలు ఇచ్చేందుకు, ప్రస్తుత గ్యారెంటీలు కొనసాగించేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. బకాయిలు చెల్లించమని పదేపదే టెలికం సంస్థను బ్యాంకులు అడుగుతున్నాయని టెలికం కార్యదర్శికి రాసిన లేఖలో COAI డైరెక్టర్ పేర్కొన్నారు. దీంతో పరిశ్రమను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ (DCC) శుక్రవారం సమావేశం కానుంది.

ఐడియా డిమాండ్లు ఇవే.. డేటాపై..
టెల్కోలను ఆదుకునేందుకు వొడాఫోన్ ఐడియా పలు డిమాండ్లు ముందు ఉంచింది. అందులో..
- మొబైల్ డేటా ఛార్జీలను ఇప్పుడున్న ధరలతో పోలిస్తే 7 నుండి 8 రెట్లు పెంచాలి.
- ప్రస్తుతం 1GB డేటా ఛార్జ్ రూ.4 నుండి రూ.5గా ఉంది. దీనిని రూ.35కు చేయాలి.

ఐడియా డిమాండ్లు ఇవే.. కాల్స్‌పై..
- ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలవారీ మొబైల్ కనెక్షన్ ఛార్జీని కనీసంగా రూ.50గా నిర్ణయించాలి.
- అవుట్ గోయింగ్ కాల్స్ ఛార్జీని నిమిషానికి కనీసం 6 పైసలు పెంచాలి.

ప్రభుత్వం నుండి..
- లైసెన్స్ రుసుమును ప్రస్తుతం 8 శాతం నుండి 3 శాతానికి తగ్గించాలి.
- స్పెక్ట్రం వినియోగ ఛార్జీలను సున్నా స్థాయికి లేదా స్పెక్ట్రంలకు ఒకేలా ఒక శాతంగా నిర్ణయించాలి.
- AGR బకాయిల వడ్డీ, జరిమానా చెల్లింపులకు మూడేళ్ల మారటోరియంతో సహా మొత్తం బకాయిల చెల్లింపుకు 18 సంవత్సరాల గడువు కావాలి.
- ప్రభుత్వం వద్ద ఉన్న రూ.8వేల కోట్ల విలువైన జీఎస్టీ క్రెడిట్‌ను సర్దుబాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తాము లెక్కగట్టిన ఏజీఆర్ బకాయిల అసలులో మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications