For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లండన్ హైకోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు, భారత్‌కు అప్పగింతపై కీలక అడుగు

|

బ్యాంకులకు రూ.9వేల కోట్ల వరకు ఎగ్గొట్టి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు 2018లో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అతను దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ కోర్టు సోమవారం కొట్టివేసింది. భారత్ రప్పించేందుకు మరో అడుగు ముందు పడినట్లే.

దివాళాపై సమయమిద్దాం: విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో మరోసారి ఊరటదివాళాపై సమయమిద్దాం: విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో మరోసారి ఊరట

మాల్యా పిటిషన్ కొట్టివేసిన కోర్టు

మాల్యా పిటిషన్ కొట్టివేసిన కోర్టు

లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఇద్దరు సభ్యులు లార్డ్స్ జస్టిస్ స్టీఫెన్ ఇర్విన్, జస్టిస్ ఎలిజబెత్ లాంగ్‌లతో కూడిన ధర్మాసనం ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.మాల్యాను న్యాయపరంగా భారత్ రప్పించేందుకు సీబీఐ, ఈడీలు యూకే కోర్టులో ప్రయత్నాలు చేస్తున్నాయి. మాల్యా సెప్టెంబర్ 1, 2009 నుండి జనవరి 24, 2017 మధ్య అక్రమాలకు పాల్పడ్డాడు.

కానీ మాల్యాకు కాస్త సమయం

కానీ మాల్యాకు కాస్త సమయం

మాల్యా పిటిషన్‌ను యూకే హైకోర్టు కొట్టివేసింది. అతనిని భారత్ రప్పించేందుకు కీలక అడుగు పడినట్లే. కానీ అదే సమయంలో యూకే సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 14 రోజుల సమయం ఇచ్చింది. అతను సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తే యూకే హోమ్ ఆఫీస్ ఈ నిర్ణయం కోసం మరింతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఆయన అప్లై చేసుకోకుంటే 28 రోజుల్లో భారత్ రప్పించే ప్రాసెస్ అవుతుంది. అతని అప్పీల్ లోయర్ కోర్టు, మరో అప్పీల్ లండన్ హైకోర్టులో తిరస్కరించబడ్డాయి.

ఇప్పటికే ఆస్తులు అటాచ్

ఇప్పటికే ఆస్తులు అటాచ్

బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన మాల్యా 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేసిన ఈడీ, సీబీఐ చార్జ్ షీట్లను దాఖలు చేశాయి. మాల్యాకు చెందిన ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేశాయి. మాల్యాను ప్రభుత్వం ఆర్థిక నేరగాడుగా ప్రకటించింది. విచారణ నిమిత్తం అతడిని ఇండియాకు తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. భారత ప్రభుత్వ వాదనను సమర్థించిన బ్రిటన్ పోలీసుల సహకారంతో 2017 ఏప్రిల్‌లో విజయ్ మాల్యాను లండన్‌లో భారత అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పైన విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ నెలలో మాల్యాను అప్పగించాలని యూకే కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత వివిధ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

English summary

లండన్ హైకోర్టులో విజయ్ మాల్యాకు చుక్కెదురు, భారత్‌కు అప్పగింతపై కీలక అడుగు | Vijay Mallya Loses High Court Appeal Against Extradition

Business tycoon Vijay Mallya on Monday lost his High Court appeal in London against a 2018 decision to extradite him to India to face fraud charges resulting from the collapse of his defunct company Kingfisher Airlines. The case will now go to UK Home Secretary Priti Patel for a final call.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X