For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18 డాలర్లకే ఇండియా టూ వియత్నాం.. తక్కువ ధరకే సేవలందిస్తున్న ఆ విమాన సంస్థ.. కారణమేమిటంటే..

|

VietJet Airways: విహార యాత్రకు వెళ్లాలనుకునేవారికి ఇదొక మంచి శుభవార్తని చెప్పుకోవాలి. ప్రస్తుతం విమాన ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానానికి వన్‌వే టికెట్ ఐదు వేల రూపాయలకు పైగానే ఉంది. కానీ.. మీరు ఢిల్లీ లేదా ముంబై నుంచి వియత్నాంలోని కొన్ని నగరాలకు కేవలం 18 డాలర్లు లేదా మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,400లకు వన్-వే ఫ్లైట్ టిక్కెట్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ వియత్నాం విమానయాన సంస్థ వియట్‌జెట్ అందిస్తోంది. ఇది భారతదేశం నుంచి వియత్నాంకు నాలుగు కొత్త విమాన మార్గాలను ప్రారంభించింది.

18 డాలర్లకే వన్-వే టిక్కెట్..

18 డాలర్లకే వన్-వే టిక్కెట్..

భారత్-వియత్నాం దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా వియట్‌జెట్ నాలుగు సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. ఈ సర్వీస్ భారతదేశంలోని ముంబై నుంచి వియత్నామీస్ నగరం హనోయి, న్యూ ఢిల్లీ/ముంబై నుంచి ఫు క్వోక్ వరకు ఉంటుంది. న్యూ ఢిల్లీని హనోయితో కలుపుతూ రెండు దేశాల మొదటి ప్రత్యక్ష విమాన సేవలు ఏప్రిల్‌లోనే ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ప్రతి వారం మూడు నుంచి నాలుగు విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రయాణికులు ఇప్పుడు ఈ మార్గాల కోసం విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని, వన్-వే ఛార్జీలు కేవలం 18 డాలర్ల కంటే తక్కువగా ఉంటాయని కంపెనీ తెలిపింది. అయితే.. ఇందులో పన్నులు, ఇతర రుసుములు కలపబడలేదు.

సెప్టెంబర్‌లో మరికొన్ని రూట్లలో సర్వీస్..

సెప్టెంబర్‌లో మరికొన్ని రూట్లలో సర్వీస్..

VietJet వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 9, 2022 నుంచి ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు ముంబై-ఫు క్వాక్ మార్గంలో నాలుగు వీక్లీ విమానాలు ప్రవేశపెట్టబడతాయి. అలాగే.. న్యూఢిల్లీ- ఫు క్వాక్ మధ్య సేవలు కూడా సెప్టెంబర్ 9, 2022 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విమానాలు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉంటాయి. హో చి మిన్ సిటీ/హనోయి-ముంబై మార్గాల్లో ఈ నెలలో విమానాలు ప్రారంభమయ్యాయి. వియత్నాం-ఇండియా ఫ్లైట్ నెట్‌వర్క్ విస్తరణ రెండు దేశాల మధ్య ప్రయాణ కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వియత్‌జెట్ వైస్ ప్రెసిడెంట్ న్గుయెన్ థాన్ సన్ చెప్పారు.

కేవలం ఐదు గంటల ప్రయాణ సమయం..

కేవలం ఐదు గంటల ప్రయాణ సమయం..

1972లో భారత్- వియత్నాం మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి 50 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు భారతీయ పర్యాటకులు కూడా విహార యాత్రల కోసం వియత్నాం వెళ్తున్నారు. భారత్ లోని ఏ నగరం నుంచి వియత్నాంలోని ఏదైనా నగరానికైనా విమానంలో ప్రయాణించే దూరం కేవలం ఐదు గంటలు మాత్రమే. ఇంతకు ముందు భారత్ నుంచి వియత్నాం నగరాలకు నేరుగా విమానాలు లేవు. అందువల్ల అక్కడికి వెళ్లాలంటే థాయిలాండ్ లేదా మలేషియాలో ఓడలు మారాల్సి వచ్చేది. VietJet ఈ మార్గంలో ప్రత్యక్ష సేవలను ప్రారంభించినప్పటి నుండి, రెండు దేశాల మధ్య విమాన సమయం ఐదు గంటల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. VietJet విస్తారమైన అంతర్జాతీయ నెట్‌వర్క్ కారణంగా, మీరు చాలా తక్కువ సమయంలో ఆగ్నేయ, ఈశాన్య ఆసియాకు చేరుకోవచ్చు. COVID-19కి సంబంధించిన అరైవల్ నియమాలను వియత్నాం తీసివేసింది. కాబట్టి విదేశీ ప్రయాణికులు ఇప్పుడు COVID-19 మహమ్మారి కంటే ముందు వియత్నాంలో తమ ప్రయాణాలను ఆస్వాదించవచ్చు.

Read more about: vietnam
English summary

18 డాలర్లకే ఇండియా టూ వియత్నాం.. తక్కువ ధరకే సేవలందిస్తున్న ఆ విమాన సంస్థ.. కారణమేమిటంటే.. | VietJet Airways offering india to vietnam flights at just 18 dollars cost

now you can fly from india to vietnam at just cost of 18 dollars with this air carrier
Story first published: Thursday, June 23, 2022, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X