4G నెట్ వర్క్ స్పీడ్‌లో VI(వోడాఫోన్ ఐడియా)... రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ను అధిగమించింది. తద్వారా సెప్టెంబర్ త్రైమాసికానికి వేగవంతమైన మొబైల్ ఆపరేటర్‌గా నిలిచింది. నెట్ వర్క్ అనలిస్ట్ ఊక్లా ప్రకారం 4జీ నెట్ వర్క్‌లో మూడో క్వార్టర్లో వొడాఫోన్ ఫాస్టెస్ట్ మొబైల్ ఆపరేటర్‌గా నిలిచింది. స్పీడ్‌కు సంబంధించి వివిధ నగరాల మధ్య తేడా ఉంది. హైదరాబాద్‌లో ఫాస్టెస్ట్ డౌన్ లోడ్ స్పీడ్ నమోదయింది.
దేశంలో సగటు డౌన్ లోడ్ స్పీడ్ ఏటా 11.6 శాతం పెరుగుతోందని ఊక్లా తెలిపింది. ఈ నివేదిక ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో VI సగటు డౌన్ లోడ్ స్పీడ్ 13.74Mbps, అప్ లోడ్ స్పీడ్ 6.19Mbpsగా ఉంది. ఎయిర్టెల్ సగటు డౌన్ లోడ్ స్పీడ్ 13.58Mbps, అప్ లోడ్ స్పీడ్ 4.15Mbps, జియో డౌన్ లోడ్ స్పీడ్ 9.71Mbps, అప్ లోడ్ స్పీడ్ 3.41Mbpsగా ఉంది. డౌన్ లోడ్, అప్ లోడ్ స్పీడ్‌లో జియో మూడో స్థానంలో ఉంది.

అయితే 4జీ నెట్ వర్క్ అందుబాటులో జియో 99.7 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఎయిర్టెల్ 98.7 శాతంతో రెండో స్థానంలో, వొడాఫోన్ ఐడియా 91.1 శాతంతో మూడో స్థానంలో ఉంది. మొబైల్ నెట్ వర్క్స్ ద్వారా సగటు డౌన్ లోడ్ వేగంలో హైదరాబాద్ 14.35 శాతంగా ముందు ఉంది. ఆ తర్వాత ముంబై 13.55Mpbs, విశాఖట్నం 13.40Mpbsగా ఉంది. భారత ప్రముఖ నగరాల్లో డౌన్ లోడ్ స్పీడ్‌లో ఢిల్లీ 13.04Mpbsతో ఆరో స్థానంలో ఉంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications