For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Videocon Loan Case: వీడియోకాన్ లోన్ విషయంలో కేసులో అరెస్ట్.. దూకుడు పెంచిన CBI

|

Videocon Loan Case: వీడియోకాన్ లోన్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) డిసెంబర్ 26న అరెస్టు చేసింది.

వీడియోకాన్ లోన్..

వీడియోకాన్ లోన్..

వీడియోకాన్ గ్రూప్ ఐసీఐసీఐ బ్యాంక నుంచి రూ.3,250 కోట్ల రుణాన్ని పొందింది. ఈ లోన్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వేణుగోపాల్ ధూత్‌ అరెస్ట్ జరిగింది. ధూత్‌ను ఈరోజు తెల్లవారుజామున ముంబైలో అధికారులు అరెస్టు చేశారు.

కొచ్చర్ పాత్ర..

కొచ్చర్ పాత్ర..

2009- 2011 మధ్య కాలంలో చందా కొచ్చర్ బ్యాంక్‌కు నేతృత్వం వహించారు. ఆ సమయంలో వీడియోకాన్ రుణ వితరణ జరిగింది. అయితే ఇందులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఏళ్ల తరబడి సుదీర్ఘ విచారణ తర్వాత ఈ అరెస్టు కీలకమైనదిగా నిలుస్తోంది. దీనికి ముందు మాజీ ఎగ్జిక్యూటివ్ రిటైర్‌మెంట్ ప్రయోజనాలను తిరస్కరిస్తూ బ్యాంక్ కొచర్‌ను సీఈవోగా తొలగించింది.

ఎఫ్ఐఆర్ ప్రకారం..

ఎఫ్ఐఆర్ ప్రకారం..

నేరపూరిత కుట్ర, నిబంధనలకు సంబంధించిన పలు ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో చందా కొచ్చర్, ఆమె భర్త, వీడియోకాన్ గ్రూపునకు చెందిన వేణుగోపాల్ ధూత్, నూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వీటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.

English summary

Videocon Loan Case: వీడియోకాన్ లోన్ విషయంలో కేసులో అరెస్ట్.. దూకుడు పెంచిన CBI | Venugopal Dhoot of Videocon Group arrested by CBI in ICICI Videocon Loan Case

Venugopal Dhoot of Videocon Group arrested by CBI in ICICI Videocon Loan Case
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X