భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత గ్రూప్ ఆసక్తి
భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాను కొనడానికి బిలియనీర్ అనిల్ అగర్వాల్ యొక్క వేదాంత గ్రూప్ ఆసక్తిని వ్యక్తం చేస్తుంది. బిలియనీర్ అనిల్ అగర్వాల్ కు సంబంధించిన మెటల్స్ నుండి ఆయిల్స్ వరకు ఉన్న కంపెనీల సమ్మేళనం అయిన వేదాంత లిమిటెడ్ భారతదేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రం నజర్ .. ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ సాధ్య

బీపీసిఎల్ లో ప్రభుత్వ వాటా కొనుగోలుకు వేదాంత ఆసక్తి
బిపిసిఎల్ కోసం వేదాంత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఆసక్తి వ్యక్తీకరణ మా ప్రస్తుత ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారానికి అదనపు బలాన్ని పొందటం కోసమే అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీపీసీఎల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రాధమిక దశ అని ప్రకృతిలో అన్వేషణాత్మకమైనదని అన్నారు. బిపిసిఎల్‌లో తన మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి ప్రాథమిక బిడ్లను సమర్పించడానికి సోమవారం విండోను మూసివేసిన ప్రభుత్వం, బీపీసీఎల్ కోసం వివిధ కంపెనీల నుండి బిడ్లను అందుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బిడ్లను అంచనా వేస్తున్నారు. అయితే వేదాంత గ్రూప్ కూడా బీపీసీఎల్ కోసం ఆసక్తి కనబరచటం గమనార్హం .

పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ , ప్రైవేటీకరణకు పావులు కదుపుతున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న క్రమంలో పలు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా నిధులను సమకూర్చుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బిపిసిఎల్ లో ప్రభుత్వరంగ వాటాను అమ్మకానికి పెట్టింది. బిపిసిఎల్ లో కేంద్ర ప్రభుత్వానికి 52.98 శాతం వాటా ఉంది . ఈ వాటాల అమ్మకం ద్వారా నిధులను సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దీనికోసం బిల్డింగ్ కు పిలుపునిచ్చింది. నవంబర్ 16వ తేదీ తో బిపిసిఎల్ బిల్డింగ్ కు ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియ ముగిసింది.

చమురు సంస్థలే కాదు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్ధిక సంస్థలలోనూ వాటాల విక్రయం
బిపిసిఎల్ లో వాటా ఉపసంహరణ చేయడం ద్వారా దేశీయ ఇంధన రంగంలో ప్రైవేట్ కంపెనీల పోటీకి అవకాశం కల్పించినట్లు అవుతోందని కేంద్ర సర్కారు భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి 1.2 లక్షల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక సంస్థల్లోనూ వాటాలు విక్రయాలు, లేదా వాటాల ఉపసంహరణ, ఇంధన రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల నుండి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు శ్రీకారం చుట్టింది.

పీఎస్‌యు ల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం
అందులో భాగంగా ప్రస్తుతం ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీలలో వాటాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించడం, పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా పి ఎస్ యు ల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాలకు ఆర్థిక సహాయం చేయాలని, ఇప్పటికే వార్షిక లక్ష్యాన్ని అధిగమించి ఆర్థిక లోటును తీర్చాలని చూస్తున్న ప్రభుత్వం, బిపిసిఎల్‌లో తన వాటాను అమ్మడం ద్వారా 8 బిలియన్ డాలర్లను 10 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ బిపిసిఎల్ షేర్ ధర గత సంవత్సరంలో దాదాపు నాలుగవ వంతు పడిపోయింది.