For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జననరిలో పెరిగిన పట్టణ నిరుద్యోగ శాతం, మొత్తంగా మాత్రం తగ్గింది

|

జనవరి 2020లో దేశంలో నిరుద్యోగ శాతం తగ్గింది. డిసెంబర్ 2019లో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత జనవరిలో 7.16 శాతానికి తగ్గింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు సెంటర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ప్రకారం అన్‌ఎంప్లాయిమెంట్ తగ్గింది. అదే సమయంలో పట్టణ నిరుద్యోగం 9.7 శాతానికి పెరిగింది. 2019 డిసెంబర్‌లో ఇది 9 శాతంగా ఉంది. మొత్తం నిరుద్యోగం తగ్గినా, పట్టణ నిరుద్యోగం పెరిగింది.

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, ఈ రోజు నుండే అమల్లోకి.. ఎంత పెరిగిందంటే?భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు, ఈ రోజు నుండే అమల్లోకి.. ఎంత పెరిగిందంటే?

గ్రామీణంలో తగ్గుతున్న నిరుద్యోగ శాతం

గ్రామీణంలో తగ్గుతున్న నిరుద్యోగ శాతం

గత ఏడాది ఫిబ్రవరి నుండి జనవరి 2020 (12 నెలలు) నాటికి సరాసరి నిరుద్యోగ రేటు 7.4 శాతంగా ఉంది. గత ఏడాది అక్టోబర్ నెలలో 8 శాతంగా ఉన్న గ్రామీణ నిరుద్యోగ శాతం 2019 డిసెంబర్‌లో 6.9 శాతం, జనవరి 2020లో 6 శాతంగా నమోదయింది.

పట్టణ, గ్రామీణ నిరుద్యోగ శాతం

పట్టణ, గ్రామీణ నిరుద్యోగ శాతం

పట్టణ నిరుద్యోగం 2019 ఆగస్ట్ నెలలో 9.71 శాతంగా ఉండగా, 2020 జనవరి నాటికి 9.7 శాతంగా ఉంది. అంటే పట్ఠణ నిరుద్యోగం దాదాపు ఆగస్ట్ నెలలో ఉన్నంతగానే ఉంది. ప్రతి నెల పట్టణ, గ్రామీణ నిరుద్యోగ శాతంలో తేడా పెరుగుతోంది.

2017 మిడిల్ నుండి ఆగిపోయింది

2017 మిడిల్ నుండి ఆగిపోయింది

ఆగస్ట్, అక్టోబర్ 2019 నెలల్లో నిరుద్యోగిత రేటు 8 శాతానికి చేరుకుందని, అయితే అంతకుముందు అక్టోబర్ నెల కంటే తక్కువగా ఉందని CMIE సీఈవో అన్నారు. గత పన్నెండు నెలల కాలంలో సరాసరిన నిరుద్యోగిత రేటు 7.4 శాతంగా ఉందని, 2017 ఏడాది మధ్య నుండి ఇది ఆగిపోయిందని చెప్పారు.

English summary

జననరిలో పెరిగిన పట్టణ నిరుద్యోగ శాతం, మొత్తంగా మాత్రం తగ్గింది | Urban Unemployment Increases Sharply to 9.7% in January 2020

In January 2020, the unemployment rate in India was 7.16%, a decline from the 7.6% mark recorded in December 2019, according to data released by the Centre for Monitoring Indian Economy (CMIE).
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X