For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UPI: రికార్డు స్థాయిలో UPI వినియోగం.. మొత్తం లావాదేవీల్లో UPI వాటా ఎంతంటే..

|

UPI: IT సేవల విభాంగలో భారత్ ముందంజలో ఉంది. టెక్నాలజీ వినియోగంలోనూ దూసుకుపోతోంది. జియో ఎంట్రీతో సామాన్యుడికి సైతం డిజిటల్ సేవలు అరచేతిలోకి వచ్చేశాయి. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే పేమెంట్స్ విధానంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రవేశంతో చెల్లింపుల దిశ మారిపోయింది. ఎంతగా అంటే.. 2021-22లో దేశంలో జరిగిన అన్ని డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా UPI ద్వారా చేసినవే అంటే అర్థం చేసుకోవచ్చు. తీరా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది కేవలం 6 ఏళ్ల క్రితమే కావడం విశేషం.

ఇదంతా ఆరేళ్లలోనే..

ఇదంతా ఆరేళ్లలోనే..

ఈసారి బడ్జెట్ ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేను గమనిస్తే.. భారతీయుల జీవితాల్లోకి UPI ఎంతగా చొచ్చుకుపోయిందే తెలుస్తోంది. FY19లో మొత్తం 3 వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరగ్గా.. UPI వాటా 17 శాతం. కానీ FY22లో జరిగిన దాదాపు 9 వేల కోట్ల డిజిటల్ చెల్లింపుల్లో UPI వాటా ఏకంగా 52 శాతం. అంటే 126 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఈ పద్ధతి ద్వారా జరిగాయన్నమాట. FY19-FY22 మధ్య కాలంలో జరిగిన లావాదేవీల్లో 115 శాతం పెరుగుదల నమోదైంది. ట్రాన్సాక్షన్స్ విలువ 121 శాతం పెరిగింది.

35 నుంచి 380కి..

35 నుంచి 380కి..

డిసెంబరు 2022లో అత్యధికంగా 782 కోట్ల లావాదేవీలతో, 12.8 లక్షల కోట్ల విలువైన నగదు బదిలీలు జరిగినట్లు సర్వే వెల్లడించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లోనే దాదాపు 3 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. వీటి విలువ 21.7 లక్షల కోట్ల కంటే ఎక్కువని పేర్కొంది. గతేడాది చివరి నాటికి 380 కంటే ఎక్కువ బ్యాంకులు UPIలో భాగం కాగా.. ఐదేళ్ల క్రితం కేవలం 35 మాత్రమే ఉన్నాయంది.

ప్రపంచవ్యాప్త విస్తరణ దిశగా..

ప్రపంచవ్యాప్త విస్తరణ దిశగా..

EY సర్వే ప్రకారం.. 87 శాతం ఫిన్‌ టెక్‌(ఆర్థిక వ్యవహారాల్లో టెక్నాలజీ వినియోగం) స్వీకరణ రేటుతో భారత్ ముందంజలో ఉంది. ప్రపంచ సగటు 64తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ప్రభుత్వం, RBI తీసుకుంటున్న చర్యలే ఇందుకు కారణమని తెలుస్తోంది. రిటైల్ ప్లాట్ ఫారంలు, ఇ-కామర్స్ లావాదేవీలతో సహా సెక్యూరిటీలలో చెల్లింపులకు UPIను అనుమతిస్తున్నారు. పది దేశాలకు చెందిన NRIలు సైతం మొబైల్ నంబర్ లేకుండా UPI వినియోగించుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ప్రకటించింది. మారకపు విలువగా రూపాయికి బలం పెరుగుతుండటంతో.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఈ సేవలు విస్తరిస్తాయని నిపుణలు అంచనా వేస్తున్నారు.

English summary

UPI: రికార్డు స్థాయిలో UPI వినియోగం.. మొత్తం లావాదేవీల్లో UPI వాటా ఎంతంటే.. | UPI Payments rapid growth due to high fintech acceptancy rate in India

UPI payments growth in India
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X