For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Railway News: రైల్వేలకు చుక్కలు చూపించిన వ్యక్తి.. 22 ఏళ్లు కోర్టులో పోరాటం.. అసలు ఏం జరిగిందంటే..

|

Railway News: కొన్నిసార్లు సాధారణ కేసుల పరిష్కారానికి కూడాా సంవత్సరాలు పట్టవచ్చు. అచ్చం అలాంటిదే ఇక్కడ చోటుచేసుకుంది. తనకు న్యాయం కావాలంటూ ఒక వ్యక్తి 22 ఏళ్లుగా భారతీయ రైల్వేపై న్యాయస్థానంలో పోరాడుతున్నాడనే వార్త మిమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. అయితే ఇక్కడ అంతిమ విజయం అతనికే దక్కింది. కొన్ని సమయం పడుతుంది కానీ విజయం తనకే దక్కుతుందని సదరు వ్యక్తి చేసిన ప్రయత్నం ఫలిచింది. రెండు దశాబ్దాల పోరాటం తరువాత న్యాయం అతడినే వరించింది.

రైల్వేతో గొడవ ఏంటి..?

రైల్వేతో గొడవ ఏంటి..?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన తుంగనాథ్ చతుర్వేది అనే వ్యక్తి 22 ఏళ్లు భారతీయ రైల్వేలపై న్యాయం కోసం పోరాడాడు. ఇతను ఒక న్యాయవాది. 1999లో రైలులో ప్రయాణించటానికి ఆయన రెండు టిక్కెట్లను కొన్నారు. అయితే వాటిపై రూ.20 అదనంగా వసూసలు చేశారు. ఈ ఘటన ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లోని మధుర కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనిపై ఆయన న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించారు.

తాజాగా కోర్టు తీర్పు..

తాజాగా కోర్టు తీర్పు..

ఈ వ్యవహారంలో వినియోగదారుల న్యాయస్థానం గత వారం చతుర్వేదికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని రైల్వేకి సూచించింది. ఈ కేసుకు సంబంధించి ఆయన దాదాపుగా 100 కంటే ఎక్కువ సార్లు విచరాణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 66 సంవత్సరాలు కావటం గమనార్హం.

టిక్కెట్ బుకింగ్ క్లర్క్..

టిక్కెట్ బుకింగ్ క్లర్క్..

ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్న చతుర్వేది మథుర నుంచి మొరాదాబాద్‌కు ప్రయాణిస్తుండగా.. టిక్కెట్ బుకింగ్ క్లర్క్ అతను కొనుగోలు చేసిన రెండు టిక్కెట్‌ల కోసం రూ.20 ఎక్కువ ఛార్జీ విధించాడు. దీంతో బుకింగ్ క్లర్క్‌పై మధురలోని వినియోగదారుల కోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలని సమస్య పరిష్కారానికి రైల్వే ట్రిబ్యునల్‌కు వెళ్లాలని రైల్వే వాధించింది. 2021 సుప్రీం కోర్ట్ తీర్పును వినియోగదారుల కోర్టులో విచారించవచ్చని నిరూపించడానికి చతుర్వేది ఉపయోగించటంతో కేసు విచారణ వేగం పుంజుకుంది.

రైల్వేపై జరిమానా..

రైల్వేపై జరిమానా..

సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఈ కేసులో బాధితుడైన చతుర్వేదికి రూ.15,000 చెల్లించాలని కోర్టు రైల్వేని ఆదేశించింది. 1999 నుంచి 2022 వరకు అతనికి సంవత్సరానికి రూ.20పై 12% లెక్కించి మెుత్తాన్ని తిరిగి చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఈ మెుత్తాన్ని 30 రోజుల్లో అందించాలని లేకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేటును 15 శాతానికి పెంచుతామని హెచ్చరించింది. అయితే ఇక్కడ తనకు డబ్బు ముఖ్యంకాదని, తాను న్యాయవాదిని కాబట్టి తాను న్యాయం కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించానని చతుర్వేది వెల్లడించారు.

English summary

Railway News: రైల్వేలకు చుక్కలు చూపించిన వ్యక్తి.. 22 ఏళ్లు కోర్టులో పోరాటం.. అసలు ఏం జరిగిందంటే.. | UP man sued indian railway over collecting extra fare won case after 22 years fight

UP man sued indian railway over collecting extra fare won case know details
Story first published: Friday, August 12, 2022, 11:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X