For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Oxygen shortageను అధిగమించడానికి కేంద్రం కీలక నిర్ణయం: కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మాఫీ

|

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహా భయానకంగా విజృంభిస్తోంది. సెకెండ్ వేవ్ దెబ్బ తీవ్రంగా పడుతోంది. అన్ని రంగాలూ దీని ప్రభావానికి గురవుతున్నాయి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యను విధించడం, వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. నిర్మాణ, మౌలిక రంగాలపై ఆధారపడిన పరిశ్రమలు సెకెండ్ వేవ్ ధాటికి కుప్పకూలిపోయే దశకు చేరుకుంటున్నాయి. ప్రత్యేకించి- ఆక్సిజన్ కొరత దేశాన్ని చుట్టుముట్టింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలన్నీ ఖాళీ అయిపోతున్నాయి.

విశాఖ నుంచి ఆక్సిజన్..

విశాఖ నుంచి ఆక్సిజన్..

ప్రాణవాయువు అందకపోవడం వల్ల రోజూ పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దేశ రాజధానిలోని గంగారామ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల 25 మంది పేషెంట్లు చనిపోయారంటే- దాని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఆక్సిజన్ ఉత్పత్తిని రెట్టింపు చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు 600 టన్నులకు పైగా ఆక్సిజన్ విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి సరఫరా అవుతోంది.

కేంద్రం కీలక నిర్ణయం..

కేంద్రం కీలక నిర్ణయం..

మహారాష్ట్ర నుంచి బయలుదేరిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్.. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రాణవాయువును నింపుకొని ఈ ఉదయమే మహారాష్ట్రకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత స్థాయి సమావేశం సందర్భంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ఆక్సిజన్‌తో పాటు వ్యాక్సిన్ కొరతను కూడా అధిగమించేలా కేంద్రం తక్షణ చర్యలను చేపట్టింది.

దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లు.. ఆక్సిజన్‌పై

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కరోనా వ్యాక్సిన్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఎత్తి వేసింది కేంద్ర ప్రభుత్వం. కస్టమ్స్ డ్యూటీని మూడు నెలల పాటు మాఫీ చేసింది. అలాగే- దిగుమతి అయ్యే ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత ఉపకరణాలు, ఇతర పరికరాలపైనా ఇప్పుడు వసూలు చేస్తోన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌ను మాఫీ చేసింది. వచ్చే మూడునెలల పాటు ఈ మాఫీ వర్తిస్తుంది. జూలై చివరి వారం వరకూ కోవిడ్ వ్యాక్సిన్లు, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌లను వసూలు చేయబోమని మోడీ సర్కార్ ప్రకటించింది.

ఆ వస్తువులివే..

ఆ వస్తువులివే..

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కస్టమ్స్ డ్యూటీ, హెల్త్‌ సెస్‌ను మాఫీ చేసిన వస్తువుల జాబితాను ఈ ప్రకటనలో పొందుపరిచింది. మొత్తం 16 రకాల వస్తువులు ఇందులో ఉన్నాయి. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేట్‌తో కూడిన ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్స్, ట్యూబింగ్, వాక్యుమ్ ప్రెజర్ స్వింగ్ అబ్జార్పన్, ప్రెషర్ స్వింగ్ అబ్జార్పన్, ఆక్సిజన్ ప్లాంట్స్, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సపరేషన్ యూనిట్స్, ప్రొడ్యూసింగ్ లిక్విడ్ గ్యాసోస్ ఆక్సిజన్, ఆక్సిజన్ క్యానిస్టర్, ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్, ఆక్సిజన్ స్టోరేజీ ట్యాంకులు, సిలిండర్లు..ఈ జాబితాలో ఉన్నాయి.

వెంటిలేటర్లపైనా..

వెంటిలేటర్లపైనా..

క్రయోజనిక్ సిలిండర్లు, ఆక్సిజన్ జనరేటర్లు, ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఐఎస్ఓ కంటైనర్లు, ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి ఉద్దేశించిన క్రయోజనిక్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకులు, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి, దానికి ఉద్దేశించిన ఎలాంటి రకాలకు చెందిన పరికరాల దిగుమతిపైనా మూడు నెలల పాటు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వెంటిలేటర్లు, హై ఫ్లో నాసల్ క్యానులా డివైజెస్, నాన్-ఇన్‌వ్యాజివ్ వెంటిలేటర్లకు సంబంధించిన హెల్మెట్లు, ఐసీయూ వెంటిలేటర్ల దిగుమతికి కూడా కేంద్ర ప్రభుత్వం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ నుంచి మినహాయింపు ఇచ్చింది.

English summary

Oxygen shortageను అధిగమించడానికి కేంద్రం కీలక నిర్ణయం: కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మాఫీ | Union govt waives off customs duty on Covid-19 vaccines, oxygen-related equipment import

The Union government has decided to waive off basic customs duty on the import of Covid-19 vaccines for three months. It has also decided to waive off the basic customs duty and health cess on medical oxygen and oxygen-related equipment.
Story first published: Saturday, April 24, 2021, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X