For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2023: PAN కార్డ్ హోల్డర్లకు శుభవార్త.. రానున్న బడ్జెట్లో కేంద్రం కీలక నిర్ణయం..!

|

PAN Card: ఈ రోజుల్లో పాన్ కార్డు చాలా కీలకమైనదిగా మారిపోయింది. పెద్ద మెుత్తంలో నగదు ట్రాన్సాక్షన్లు చేయాలంటే పాన్ తప్పనిసరి. అయితే దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

రానున్న బడ్జెట్లో..

రానున్న బడ్జెట్లో..

2023-24 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పాన్ కార్డు విషయంలో కొన్ని సడలింపులను అందించాలను చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చాలా చోట్ల పాన్ కార్డు వివరాలను అందించాల్సి ఉండగా.. దీనిని తొలగించాలని ప్రతిపాదించే అవకాశం తెలుస్తోంది. అయితే దీనికి బదులుగా ఆ స్థానంలో ఆధార్ కార్డును వినియోగించవచ్చని సమాచారం. దేశంలోని ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కోరిన విధంగా నిబంధనలను సరళీకృతం చేయటంలో భాగంగా ఈ చర్యలు తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.

బ్యాంకుల కోరిక..

బ్యాంకుల కోరిక..

చాలా ఖాతాలు ఇప్పటికే ఆధార్‌తో సీడ్ చేయబడినందున కొన్ని బ్యాంకులు పాన్ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరాయి. మనీ ట్రాన్సాక్షన్లకు దీనిని అమలు చేసే ఆర్థిక సంస్థలు ప్రకటన వెలువడిన వెంటనే అన్ని కొత్త మార్పులను అమలు చేస్తాయని భావిస్తున్నారు. దీని ద్వారా పాన్ కార్డు లేని వారు కూడా ఆధార్ కార్డుతో అవసరమైన ఆర్థిక లావాదేవీలు జరుపుకోవటం సులువు అవుతుంది. దీంతో ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉన్నవారు సైతం దేశంలో పాన్ కార్డుకు బదులుగా ఆధార్ కార్డును వినియోగించి వాటిని పూర్తి చేయవచ్చు.

పన్ను చట్టాల మార్పు..

పన్ను చట్టాల మార్పు..

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206AA ప్రకారం.. ఎవరైనా వ్యక్తి ట్రాన్సాక్షన్లలో తన పాన్ వివరాలను అందించకపోతే సదరు లావాదేవీలు 20 శాతం TDSకి లోబడి ఉంటాయి. ఇలాంటి సందర్భంలో సదరు వ్యక్తి ఆదాయపు పన్ను బ్రాకెట్ కిందకు రానప్పటికీ అతని వద్ద నుంచి 20 శాతం పన్ను మినహాయించబడుతుంది. ఇలా ప్రస్తుత వ్యవస్థలో ఉన్న గందగరోళాన్ని వివారించటానికి కొన్ని బ్యాంకులు ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

బ్యాంక్ ఖాతాలు..

బ్యాంక్ ఖాతాలు..

ప్రస్తుతం దేశంలో UIDAI అందించిన ఆధార్ కార్డులను ప్రమాణికంగా వినియోగిస్తున్నందున దాదాపుగా అన్ని బ్యాంకులు ఖాతాదారుల అకౌంట్లకు కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో సీడ్ చేయబడ్డాయి. అందువల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A(5E) ప్రకారం నిర్ధేశించిన ట్రాన్సాక్షన్లకు పాన్ కార్డు వివరాలకు బదులుగా ఆధార్ వివరాలను అందించటానికి అనుమతిస్తుందని వారు చెబుతున్నారు.

బడ్జెట్ ప్రకటన..

బడ్జెట్ ప్రకటన..

సెక్షన్ 206AA TDS కింద వివరాలు అందించాల్సిన వారు టాక్స్ చెల్లించకుండా తప్పించుకునేందుకు వీలులేకుండా ఈ నిర్ణయం సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. పైగా ఈ విషయం పాన్ వివరాలను అందించాల్సిన అవసరం లేని వారికి స్పష్టతను అందించటంలో సహాయపడుతుంది. అయితే కొన్ని లావాదేవీలు చేసేటప్పుడు అధిక పన్ను మినహాయింపులను ఎదుర్కోవచ్చు. కేంద్రం బడ్జెట్ ప్రకటనలో దీనిపై చేసే ప్రకటన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చుతుంది.

English summary

Union Budget 2023: PAN కార్డ్ హోల్డర్లకు శుభవార్త.. రానున్న బడ్జెట్లో కేంద్రం కీలక నిర్ణయం..! | Union government planning to drop Pan card mandatory rules in Budget 2023 repalce Aadhar

Union government planning to drop Pan card mandatory rules in Budget 2023 repalce Aadhar
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X