For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Crypto Currency: ఇన్వెస్టర్లకు నిర్మలమ్మ స్ట్రాంగ్ వార్నింగ్.. క్రిప్టోలతో ఆ ప్రమాదాలు.. జాగ్రత్త..

|

Crypto Currency: క్రిప్టో కరెన్సీలకు మెుదటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో పాటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యతిరేకంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రభుత్వం ఎప్పుడు ఏ బాంబు లాంటి వార్తను ప్రకటిస్తుందో అనే ఆందోళనలో చాలా మంది ఇన్వెస్టర్లు ఉన్నారు.

 నిర్మలమ్మ క్లారిటీ..

నిర్మలమ్మ క్లారిటీ..

చట్టబద్ధతపై ప్రభుత్వ వైఖరిని మళ్లీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కిచెప్పారు. ఈ తరుణంలో క్రిప్టో పెట్టుబడులను, క్రిప్టో ఇన్వెస్టర్లను మరో సారి హెచ్చరించారు. బీజేపీ ఎకనామిక్ సెల్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ.. క్రిప్టో అనేది కరెన్సీ కాదని ప్రజలను కఠినంగా హెచ్చరించారు.

 కొత్త చట్టం..

కొత్త చట్టం..

క్రిప్టోకరెన్సీలపై త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కరెన్సీల విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని ఆమె ఇన్వెస్టర్లకు గుర్తు చేశారు. వీటి విషయంలో మనందరం ఆలోచనలను పంచుకోవలసి ఉంటుందని ఆమె అన్నారు. దయచేసి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. సాంకేతికత ఎక్కడ, ఎందుకు, ఎలా వినియోగిస్తున్నామనేదానిపై జాగ్రత్తగా ఉండాలని సీతారామన్ అన్నారు.

ప్రమాదం ఏమిటంటే..

ప్రమాదం ఏమిటంటే..

భారత ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలను గుర్తించడం లేదని, అయితే అటువంటి వర్చువల్ డిజిటల్ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తోంది. మనీలాండరింగ్, టెర్రర్ ఫండింగ్ ప్రమాదాలను పరిష్కరించేందుకు క్రిప్టోల విషయంలో ప్రపంచ దేశాల్లో నియంత్రణ అత్యవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బలమైన వాదనను వినిపిస్తున్నారు.

English summary

Crypto Currency: ఇన్వెస్టర్లకు నిర్మలమ్మ స్ట్రాంగ్ వార్నింగ్.. క్రిప్టోలతో ఆ ప్రమాదాలు.. జాగ్రత్త.. | union finance minister Nirmala Sitharaman's strong warning against cryptocurrency

Nirmala Sitharaman's strong warning against cryptocurrency Here is what crypto investors should know.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X