మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ మీటింగ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. 28 నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు కేంద్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది. మోడీ అధ్యక్షతన డిసెంబర్ 30, 2020న కేబినెట్ భేటీ జరిగింది. ఆకాష్ మిసైల్ సిస్టం ఎగుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఫ్రెండ్లీ ఫారన్ దేశాలతో వ్యూహాత్మక సంబంధాల పెంపులో భాగంగా 5 బిలియన్ డాలర్ల డిఫెన్స్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. రాయల్ గవర్నమెంట్ ఆఫ్ భూటాన్, గవర్నమెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య కూడా మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU)కు ఆమోదం తెలిపింది. 2021లో ఈస్టోనియా, పారగువే, డొమినిషియన్‌లలో మూడు ఇండియన్ మిషన్స్‌ను ఓపెన్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రధానంగా ఎప్పటిలాగే ఆదాయపు పన్నుకు సంబంధించి సవరణలు ఆశిస్తున్నారు. ప్రస్తుత కీలక పరిస్థితుల్లో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది.