For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank news: అదరగొట్టిన యూనియన్ బ్యాంకు.. 100 శాతానికి చేరువలో Q4 నికర లాభం

|

Bank news: మార్చితో ముగిసిన త్రైమాసికంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి లాభాలను ఆర్జించింది. స్టాండ్ అలోన్ నికర లాభంలో 93.27 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఇదే త్రైమాసికంలోని 1,440 కోట్లతో పోలిస్తే ఈసారి 2,782 కోట్లను సాధించింది. నికర వడ్డీ ఆదాయం (NII) 8 వేల 251 కోట్లుగా వెల్లడించింది. అంటే 21.88 శాతం వృద్ధిని ఉందన్నమాట.

మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ. 3 చొప్పున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డివిడెండ్ ప్రకటించారు. తేలికైన నిధుల మూలంగా భావించే CASA డిపాజిట్లు గతేడాదితో పోలిస్తే 4.47 శాతం పెరిగినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో బ్యాంకు వెల్లడించింది. మొత్తం డిపాజిట్లను చూస్తే గత ఆర్థిక సంవత్సరం చివరి రోజు నాటికి 11 లక్షల 17 వేల 716 కోట్లని పేర్కొంది.

Union bank posts 93 Percent net profit rise in Q4

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తుల నాణ్యతలో కూడా మెరుగుదలని నివేదించింది. స్థూల NPA అడ్వాన్సులు YoY 358 మేరకు తగ్గి 7.53 శాతానికి, నికర NPAలు 198 bps తగ్గి 1.70 శాతానికి చేరాయి. స్థూల అడ్వాన్స్‌లు 13.05 శాతం, మొత్తం డిపాజిట్లు 8.26 శాతం వృద్ధి సాధించాయి. తద్వారా మొత్తం వ్యాపారం YoY 10.23 శాతం పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. మార్చి 31, 2023 నాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం విలువ 19 లక్షల 27 వేల 621 కోట్లన్నమాట.

FY23 మాదిరిగానే మార్చి 2024కి అడ్వాన్స్‌ లలో 10-12 శాతం వృద్ధి సాధించాలని బ్యాంకు నిర్దేశించుకుంది. డిపాజిట్ లనూ 8-10 మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది మునుపటి టార్గెట్ కంటే తక్కువ కావడం గమనార్హం. నికర వడ్డీ మార్జిన్‌ కు సంబంధించిన మార్గదర్శకాన్ని మాత్రం స్థిరంగా 3 శాతం వద్దే ఉంచింది. కానీ స్థూల NPAని 6 శాతం కంటే దిగువకు తీసుకురావాలని యోచిస్తోంది.

English summary

Bank news: అదరగొట్టిన యూనియన్ బ్యాంకు.. 100 శాతానికి చేరువలో Q4 నికర లాభం | Union bank posts 93 Percent net profit rise in Q4

Union bank posts 93Percent net profit rise in Q4..
Story first published: Sunday, May 7, 2023, 8:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X