For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదు దశాబ్దాల బంధానికి బ్రేక్.. అమల్లోకి ‘బ్రెగ్జిట్’

|

ఎట్టకేలకు బ్రిటన్ కోరిక నెరవేరింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)‌తో గత 47 ఏళ్లుగా సాగుతున్న బంధాన్ని తెంచుకుని బయటికి వచ్చేసింది. బ్రిటన్ చరిత్రలో ఈ ఘట్టాన్ని కొందరు 'నవశకం'గా అభివర్ణిస్తుండగా, బ్రెగ్జిట్ వ్యతిరేకులు మాత్రం ఇదొక 'చేదు అనుభవం' అంటున్నారు.

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడాన్నే ఇన్నాళ్లూ 'బ్రెగ్జిట్'గా అభివర్ణిస్తూ వచ్చారు. ఇంతకీ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎందుకు విడిపోవాలనుకుంది? బ్రెగ్జిట్ అనంతరం ఇప్పుడిక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం!

మూడుసార్లు వీగిపోయి, చివరికి...

మూడుసార్లు వీగిపోయి, చివరికి...

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి వచ్చేయాలని అనుకున్నప్పుడు దీనిపై ప్రజాభిప్రాయం కోరారు. అయితే 2016లోనే ప్రజలు దీనికి అనుకూలంగా తీర్పు చెప్పినా.. మళ్లీ బ్రెగ్జిట్‌కి నాలుగేళ్లు పట్టింది. దీనికి కారణం.. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారు అయ్యే విషయంలో బ్రిటన్ పార్లమెంట్‌లో తీవ్ర జాప్యం జరగడమే. గతంలో మూడుసార్లు బ్రెగ్జిట్ బిల్లు అక్కడి చట్టసభల ముందుకు వచ్చినా.. ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదరక మూడుసార్లూ వీగిపోయింది. ఈ క్రమంలో నాటి ప్రధాని థెరిసా మే రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. ఆమె తరువాత ప్రధాని పదవిలోకి వచ్చిన బోరిస్ జాన్సన్ జనవరి 10న అతికష్టం మీద బ్రెగ్జిట్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోగలిగారు. దీంతో ఐదు దశాబ్దాల ఈయూ బంధానికి బ్రిటన్ స్వస్తి పలికినట్లయింది.

బ్రిటన్ ఎందుకు ‘బ్రెగ్జిట్' అవుదామనుకుంది?

బ్రిటన్ ఎందుకు ‘బ్రెగ్జిట్' అవుదామనుకుంది?

యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశంగా కొనసాగడం వల్ల బ్రిటన్‌కు పొరుగు దేశాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల సొంత దేశంలోని ప్రజలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు తగ్గిపోతున్నాయనే ఆలోచననే ‘బ్రెగ్జిట్'కు ప్రధాన కారణం. ప్రస్తుతం బ్రిటన్ జనాభాలో దాదాపు 21.5 లక్షల మంది ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారేనని గణాంకాలు తెలుపుతున్నాయి. మరోవైపు దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడం, బ్రిటన్‌లో పుట్టి పెరిగిన వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, ఉద్యోగుల వేతనాల వృద్ధిలోనూ స్తబ్ధత నెలకొనడం.. ఈ కారణాలన్నింటి దృష్ట్యా ఈయూ బంధనాల నుంచి బయటపడడమే శ్రేయస్కరమని మెజారిటీ బ్రిటీష్ పౌరుల అభిప్రాయం. అందుకే ‘బ్రెగ్జిట్'కు అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో ఈయూ నుంచి బయటికి వచ్చేసి స్వతంత్ర దేశంగా కొనసాగాలనేది బ్రిటన్ యోచన.

నవశకానికి నాంది పలికినట్లేనా?

నవశకానికి నాంది పలికినట్లేనా?

‘బ్రెగ్జిట్' అనంతరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దేశ ప్రజలకు ఒక వీడియో సందేశం పంపారు. అందులో ఈ తాజా పరిణామాన్ని ‘నవశకానికి నాంది'గా ఆయన అభివర్ణించారు. దేశంలో పెను మార్పులకు, దేశ పునరుజ్జీవానికి, దేశ అభివృద్ధికి ‘బ్రెగ్జిట్' ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ఇన్నేళ్ల చరిత్రలో ‘బ్రెగ్జిట్'కు గుర్తుగా 50 పెన్స్‌ల కొత్త నాణాన్ని మాత్రం విడుదల చేశారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచే చలామణీలోకి వచ్చేశాయి. ఇప్పటి వరకు ఈయూ సభ్య దేశాల పౌరులు యూకేలోకి స్వేచ్ఛగా ప్రవేశించేవారు. అయితే ఇకమీదట యూరోప్‌లోని ఇతర దేశాల పౌరులు యూకేలోకి రావాలంటే ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. పౌరుల పాస్‌పోర్ట్ రంగు కూడా మారనుంది. ఇప్పటి వరకు గోధుమ రంగులో ఉన్న ఈ పాస్‌పోర్టులు తిరిగి నీలిరంగులోకి మారనున్నాయి.

బయటికొచ్చేస్తే అంతా బాగవుతుందా?

బయటికొచ్చేస్తే అంతా బాగవుతుందా?

అయితే ఈయూ నుంచి బ్రిటన్ ‘బ్రెగ్జిట్' అయినంత మాత్రాన ఆ దేశంలో ఇప్పటికిప్పుడు జరిగే పెద్ద మార్పులేమీ ఉండవు. సాంకేతికంగా పూర్తిస్థాయిలో ‘బ్రెగ్జిట్'కు మరో 11 నెలల సమయం పడుతుంది. దీనినే ‘ట్రాన్సిషన్ పీరియడ్'గా వ్యవహరిస్తున్నారు. ఈ పీరియడ్ ముగిసే వరకు ఈయూ నిబంధనలను బ్రిటన్ పాటించాల్సి ఉంటుంది. సమాఖ్య బడ్జెట్‌కు కూడా తన వంతు సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే ఇకమీదట జరిగే ఈయూ సదస్సుల్లో మాత్రం బ్రిటన్ పాల్గొనదు. ఇప్పటి వరకు ఈయూ సభ్యదేశాలతో కుదిరిన ఒప్పందాలను బ్రిటన్ రద్దు చేసుకోవడమో లేక మళ్లీ ఒప్పందం కుదుర్చుకోవడమే చేయాల్సి ఉంటుంది. దీనికి సుదీర్ఘ చర్చలు, మంతనాలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఈయూ సభ్యదేశాలతో బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చు. కాకపోతే అవి ఈ పీరియడ్ ముగిసిన తరువాత నుంచే అమలులోకి వస్తాయి.

English summary

UK leaves the European Union, Will Brexit works out

The UK has officially left the European Union after 47 years of membership - and more than three years after it voted to do so in a referendum. The historic moment, which happened was marked by both celebrations and anti-Brexit protests. Boris Johnson, the prime minister said "For many people this is an astonishing moment of hope, a moment they thought would never come."
Story first published: Sunday, February 2, 2020, 15:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X