For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

300 ఏళ్లలో దారుణ ఆర్థిక పతనం, ఎకనమిక్ ఎమర్జెన్సీపై రిషి సునక్

|

కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు ఏకంగా మైనస్ 23.9 శాతంతో దారుణంగా దెబ్బతిన్నది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఆర్థిక వ్యవస్థలు కూడా దశాబ్దాల నాటికి పడిపోయాయి. యూకే అయితే 300 సంవత్సరాల్లో అత్యంత దారుణ తిరోగమనాన్ని నమోదు చేసింది. ఛాన్సులర్ ఆఫ్ ఎక్స్‌చెకర్ రిషి సునక్ కరోనా కారణంగా ఖర్చులు భారీగా తగ్గించారు. దేశం ఆర్థిక అత్యయిక పరిస్థితిని ఎదుర్కొంది. కరోనా మహమ్మారి డెబిట్స్‌ను చెల్లించేందుకు వ్యయ కోతలతో ఉద్యోగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా సమతౌల్యం చేసే ప్రయత్నం చేశారు.

అప్పుడే చైనా కంటే భారత్ చౌకగా తయారు చేయగలదు, ఉద్యోగాలపై అది సరికాదుఅప్పుడే చైనా కంటే భారత్ చౌకగా తయారు చేయగలదు, ఉద్యోగాలపై అది సరికాదు

ఇవే మా ముందున్న లక్ష్యాలు

ఇవే మా ముందున్న లక్ష్యాలు

వచ్చే ఏడాది నిరుద్యోగిత రేటు 7.5 శాతంగా నమోదవుతుందని అంచనా. ఉద్యోగాలకు ఊతమిచ్చేలా బిలియన్ల కొద్ది ఫౌండ్లను మౌలిక సదుపాయాల కోసం ప్రకటించారు రిషి సునక్. తక్కువ వేతనం ఉన్న కార్మికులకు పెంచారు. అయితే ప్రభుత్వరంగ వేతనాల పెంపు వంటి వాటికి నిధులు తగ్గించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వీరికి ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తమ హెల్త్ ఎమర్జెన్సీ ఇంకా ముగియలేదని, అలాగే తమ ఎకనమిక్ ఎమర్జెన్సీ ఇప్పుడే ప్రారంభమైందని రిషి సునక్ పార్లమెంటుకు తెలిపారు. ప్రస్తుతం తమ ముందున్న తొలి ప్రాధాన్యత ప్రజల జీవితాలను కాపాడం, అలాగే జీవనోపాధికి అండగా ఉండటమని చెప్పారు.

300 ఏళ్లలో దారుణ పతనం

300 ఏళ్లలో దారుణ పతనం

కరోనా మహమ్మారి కారణంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని రిషి సునక్ తెలిపారు. ఓ వైపు ద్రవ్యలోటు అంతకంతకూ పెరుగుతోందని, ఈ సమస్య పరిష్కారానికి కఠినమైన నిర్ణయాలు తప్పవన్నారు. 1709లో మహా మాంద్యం తర్వాత యూకేలో మరో మహామాంద్యం అని తెలిపారు. అంటే 300 ఏళ్లలో ఇది దారుణ ఆర్థిక పతనంగా అభిప్రాయపడ్డారు.

భారీగా పెరిగిన అప్పులు

భారీగా పెరిగిన అప్పులు

ఈ ఏడాది బ్రిటన్ ఆర్థిక వృద్ధి మైనస్ 11.3 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022 వరకు కోలుకునే పరిస్థితి లేదని, ఈ దెబ్బ వల్ల 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థపై 3 శాతం దెబ్బపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది యూకే 394 బిలియన్ పౌండ్ల రుణం తీసుకుంది. దేశ జీడీపీలో ఇది 19 శాతం.

English summary

300 ఏళ్లలో దారుణ ఆర్థిక పతనం, ఎకనమిక్ ఎమర్జెన్సీపై రిషి సునక్ | UK faces worst slump in 300 years as Rishi Sunak Set to Cut Spending

Chancellor of the Exchequer Rishi Sunak sought to balance more jobs support with controversial spending cuts to help pay back the U.K.’s huge pandemic debts, as he warned the country is facing an “economic emergency.”
Story first published: Friday, November 27, 2020, 18:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X