For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూకే-భారత్ భారీ డీల్: అక్కడ సీరమ్ భారీ పెట్టుబడులు

|

భారత్‌కు చెందిన అంతర్జాతీయస్థాయి వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(CII) బ్రిటన్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. భారత్‌తో కుదిరిన బిలియన్ డాలర్ల విలువచేసే వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాల్లో భాగంగానే సీరమ్ సంస్థ యూకేలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్చువల్ సమావేశానికి ముందు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వెలువడింది.

సీరమ్ యూకేలో ఓ సేల్స్ ఆఫీస్ ఏర్పాటుతో పాటు సంస్థ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించేందకు 240 మిలియన్ పౌండ్స్ యూకేలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా భారత కంపెనీలు యూకేలో పెట్టే పెట్టుబడులతో 6,500 ఉద్యోగాల సృష్టి జరగనుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.

UK and India announce $1.4 billion investment boost, step closer to trade deal

హెల్త్ కేర్, బయోటెక్, సాఫ్టువేర్ రంగాల్లోని వివిధ కంపెనీలు యూకేలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను యూకేలో ప్రారంభించినట్లు సీరమ్ ప్రకటించింది.
ఇక సీరమ్ ఏర్పాటు చేయనున్న కొత్త విక్రయ కార్యాలయంతో దాదాపు బిలియన్ డాలర్ల బిజినెస్ జరిగే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది.

English summary

యూకే-భారత్ భారీ డీల్: అక్కడ సీరమ్ భారీ పెట్టుబడులు | UK and India announce $1.4 billion investment boost, step closer to trade deal

Britain and India announced 1 billion pounds ($1.39 billion) of private-sector investment and committed to seek a free trade deal ahead of a virtual meeting between Prime Minister Boris Johnson and Indian leader Narendra Modi on Tuesday.
Story first published: Tuesday, May 4, 2021, 21:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X