For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బ: నిలిచిపోయిన ఉబెర్... ఓలా సేవలు!

|

కరోనా దెబ్బకు ఎంతటి ఘనులైనా సరే తోక ముడవాల్సిందే అన్నట్లు తయారైంది పరిస్థితి. దేశంలో లాక్ డౌన్ విధించటంతో ప్రజలకు దాదాపు అన్ని మార్గాలు మూసుకుపోతున్నాయి. బయటకు వెళ్ళటం కష్టమవుతోంది. ఏమైనా కొనుక్కునేందుకు ఇబ్బంది అవుతోంది. ఈ సమయంలో ప్రజలందరూ ఆన్లైన్ పోర్టల్స్ వైపు చూస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల నుంచి గ్రోసరీస్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో స్విగ్గి, జొమాటో సంస్థలను ఆశ్రయించారు. ఉబెర్, ఓలా పైనా ఆధారపడ్డారు. అయితే, పరిస్థితి తీవ్రత అధికంగా ఉండటంతో వాటి సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తాత్కాలికంగా తన సేవలను రద్దు చేస్తున్నట్లు అధికారిక వెబ్సైటులో వెల్లడించింది. దీంతో దేశంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారబోతోందని స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా... రైడ్ హైలింగ్ సేవల కంపెనీలు ఉబెర్, ఓలా సైతం తమ సేవలను తాత్కాలికంగా రద్దు చేశాయి.

Covid-19: ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ షట్‍‌డౌన్! అమెజాన్‌లో ఇవి మాత్రమే కొనుగోలు చేయవచ్చు

డ్రైవర్లకు ఊరట...

డ్రైవర్లకు ఊరట...

నిన్న మొన్నటి వరకు కొన్ని రోజులే అనుకున్న కరోనా నిర్బంధం... ప్రధాని మోడీ ప్రకటనతో వచ్చే నెల 14 వ తేదీ వరకు పొడిగించినట్లైంది. దీంతో ఇప్పటికే క్యాబ్ లకు గిరాకీ లేక గత 15-20 రోజులుగా సతమతం అవుతున్న డ్రైవర్లు... మరో నెల రోజులు పాటు ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, దేశీయ రైడ్ హైలింగ్ సంస్థ ఓలా మాత్రం తన డ్రైవర్ పార్టనర్లకు కొంత ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఓలా కంపెనీ కాబులను నడుపుతున్న డ్రైవర్లకు అద్దెలు, లీజుల చెల్లింపుల నుంచి మినహాయింపు ప్రకటించింది. దీంతో ప్రస్తుత గడ్డు పరిస్థితిలో డ్రైవర్లు కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. అసలే పని లేక ఇంటి అద్దెలు కట్టలేక సతమతం అవుతున్న వారికి ఓలా చేయూత సరైన నిర్ణయం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఉబెర్ కు కూడా...

ఉబెర్ కు కూడా...

అయితే ఉబెర్ తన సొంత బ్రాండ్ పేరుతో ఇండియా లో క్యాబులు కొనుగోలు చేసిన దాఖలా లేదు. ఉబెర్ మొత్తం తన సేవల కోసం కేవలం డ్రైవర్ల మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, తన పూర్తి సేవలు రద్దు చేసినా కూడా ఉబెర్ ఇప్పటి వరకు అయితే ఇలాంటి నిర్ణయాలు ప్రకటించలేదు. ఉబెర్ ప్లాట్ఫారం పై క్యాబులు నడుపుకుంటున్న డ్రైవర్ల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వారు చాలా వరకు బ్యాంకులో లోన్లు తీసుకుని ఉబెర్ లో నడుపుతున్నారు. ప్రస్తుతం సరైన రైడ్స్ రాకపోవటంతో వారికి పనిలేకుండా పోయింది. కానీ, క్యాబు నడిచినా... నడవక పోయినా కూడా బ్యాంకులకు మాత్రం తప్పనిసరిగా వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే వారికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

రోజుకు కోటి...

రోజుకు కోటి...

దేశంలో ఉబెర్, ఓలా సంస్థల రాకతో ప్రయాణాల తీరు మారింది. ముఖ్యంగా నగరాల్లో ప్రభుత్వ రవాణా తర్వాత అధికంగా జనాలు తిరిగేది ప్రైవేట్ క్యాబుల్లోనే కావటం విశేషం. ఇలా దేశంలోని 300 కు పైగా ప్రధాన నగరాల్లో ఉబెర్, ఓలా ల ద్వారా రోజుకు కనీసం 1 కోటి మంది ప్రజలు తమ తమ గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఒక్కోటి సుమారుగా 35 లక్షల నుంచి 40 లక్షల ట్రిప్పులను నిర్వహిస్తున్నాయి. కానీ, కరోనా వైరస్ పుణ్యమా అని దేశం మొత్తం మీద అన్ని రకాల రవాణా సౌకర్యాలు రద్దు అయ్యాయి. దీంతో ఇక ఉబెర్, ఓలా వంటి సంస్థలు కూడా వాటిని రద్దు చేయక తప్పలేదు. మరో 21 రోజుల పాటు దేశంలో ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటి కార్యకలాపాలు మున్ముందు ఎలా ఉంటాయో చూడాలి.

English summary

Uber, Ola are unavailable for people in across the major cities

Due to the extension of lock down until April 14, the raid hailing service providers like Uber, Ola are un-available for people in across the major cities of India. Driver partners are finding it difficult to stay afloat as they need to pay their EMIs to banks despite the prevailing situation. Ola however had assured its drivers to not to pay the rentals and lease fees until further notice.
Story first published: Wednesday, March 25, 2020, 19:19 [IST]
Company Search