For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Uber, Ola: విలీన చర్చలు జరగలేదు.. తేల్చిచెప్పిన ఉబెర్, ఓలా..

|

ఉబెర్ టెక్నాలజీస్, ఓలా విలీనం కోసం చర్చలు జరుపుతున్నాయన్న మీడియా కథనాలను ఆ కంపెనీలు ఖండించాయి. ఓలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ భావిష్ అగర్వాల్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబెర్ ఉన్నతాధికారులను కలిశారని, రెండు ఆధారాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. దీనిపై ఇరు కంపెనీలు స్పందించాయి.

ఎప్పటికీ విలీనం కాము
"ఆ నివేదిక సరికాదు. మేము ఓలాతో విలీన చర్చల్లో లేము " అని ఉబెర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఓలా అగర్వాల్ ట్వీట్ చేస్తూ " మేము చాలా లాభదాయకంగా, బాగా అభివృద్ధి చెందుతున్నాము. కొన్ని ఇతర కంపెనీలు కోరుకుంటే భారతదేశం నుంచి తమ వ్యాపారాన్ని నిలిపివేస్తామే తప్ప.. మేము ఎప్పటికీ విలీనం కాము." అని అన్నారు.

 Uber and Ola have denied the merger news

కోట్లలో ఖర్చు..
ఈ రెండు కంపెనీలు క్యాబ్ సేవల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఇవి ప్రయాణీకులకు ప్రోత్సాహకాలు,తగ్గింపుల కోసం బిలియన్ల కొద్దీ ఖర్చు చేశాయి. ఉబెర్ తన స్థానిక ఫుడ్ డెలివరీ వ్యాపారమైన ఉబెర్ ఈట్స్‌ను జనవరి 2020లో జొమాటో లిమిటెడ్‌కి విక్రయించింది. అయితే ఓలా తన కిరాణా డెలివరీ వ్యాపారాన్ని మూసివేసింది. తన ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్ అయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టింది.

English summary

Uber, Ola: విలీన చర్చలు జరగలేదు.. తేల్చిచెప్పిన ఉబెర్, ఓలా.. | Uber and Ola have denied the merger news

Uber Technologies Inc and its Indian rival Ola on Friday denied a media report that the ride-hailing firms were in talks for a merger.
Story first published: Saturday, July 30, 2022, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X