Elon Musk: ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. తమ ఉద్యోగానికి యాజమాన్యాలు ఎప్పుడు ఎసరపెడతాయో అనే ఆందోళనతో చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
ఇలాంటి తరుణంలో ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ చేసిన ప్రకటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. భారీ మెుత్తం చెల్లించి ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేసిన మస్క్ తన రాకతో దాదాపు 80 శాతం ఉద్యోగులను తొలగించారు. అయితే తాను నడిచిన బాటలోనే కంపెనీలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు.

టెక్ కంపెనీలకు పుట్టినిల్లైన సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు తన సూచనను పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల తొలగింపులకు వెళ్లాలని మస్క్ తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ సీఈవో కౌన్సిల్ సమ్మిట్ లో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంపెనీని టేకోవర్ చేయడానికి ముందు చాలా మందికి పెద్దగా విలువ కనిపించడం లేదని పేర్కొన్నారు. అందువల్లే తాను ట్విట్టర్ కంపెనీని తీసుకోగానే ఉద్యోగుల కోత విధించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మస్క్ తెలిపారు. దీనివల్ల ఉత్పాదకత మెరుగుపడిందని పేర్కొన్నారు.
44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ కంపెనీ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ 7500 మంది ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించారు. ప్రస్తుతం ట్విట్టర్ కంపెనీలో మెుత్తంగా 1500 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇది సహేతుకమైన సంఖ్య అని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications