Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సాధారణంగా గూగుల్ (Google) లాంటి కంపెనీలో ఉద్యోగం అంటే అది ఒక కల. లక్షల్లో జీతం, అదిరిపోయే ఫెసిలిటీస్.. ఇంకేం కావాలి అనుకుంటాం. కానీ, బెంగళూరుకు చెందిన హర్షిత్ శర్మ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ మాత్రం అందరిలా ఆలోచించలేదు. తన కలను వెతుక్కుంటూ ఆ అద్భుతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు.

Bengaluru Techie Quits Google Job to Follow Dreams Calling Himself a Robot Viral Instagram Video and Father Deadline Details Summary

'ఇన్నాళ్లూ ఒక రోబోలా బతికా'

తన చివరి వర్కింగ్ డే కంటే ఒక రోజు ముందు హర్షిత్ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అందులో తన మనసులోని మాటను బయటపెట్టాడు. "నా జీవితమంతా ఇతరుల అంచనాలకు తగ్గట్టే బతికాను. టెన్త్ తర్వాత సైన్స్, మ్యాథ్స్ తీసుకున్నా.. జేఈఈ రాశాను.. మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాను.. ఆ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను. ఇదంతా చూసి అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ నేను మాత్రం ఒక పర్ఫెక్ట్ 'లైన్ ఫాలోయింగ్ రోబో' లా మారిపోయాను" అని హర్షిత్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్థిక భరోసా, తండ్రి పెట్టిన డెడ్‌లైన్

ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక హర్షిత్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా చాలా పొదుపుగా ఉంటూ, రాబోయే మూడేళ్ల వరకు ఉద్యోగం లేకపోయినా బతికేంత డబ్బును సేవ్ చేసుకున్నాడు. అయితే తన తండ్రితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక ఒప్పందానికి వచ్చాడు. "వచ్చే ఏడాదిలోపు నువ్వు చేసే పనిలో సంపాదన మొదలు పెట్టకపోతే, మళ్లీ ఉద్యోగంలో చేరాల్సిందే" అని ఆయన తండ్రి డెడ్‌లైన్ పెట్టారు. ఇప్పుడు హర్షిత్ చేతిలో కేవలం ఒక సంవత్సరం సమయం మాత్రమే ఉంది.

'అన్నీ ట్రై చేస్తాను'

ప్రస్తుతానికి ఒక ఫిక్స్‌డ్ రొటీన్ నుంచి బయటపడిన హర్షిత్, తను ఇన్నాళ్లూ వాయిదా వేసుకున్న పనులన్నీ చేయాలనుకుంటున్నాడు. "నాకు చేయాలని ఉన్న ప్రతి ఒక్క పనినీ ఈ ఏడాదిలో ట్రై చేస్తాను. 2027 మార్చి నాటికి ఉన్న హర్షిత్ నన్ను చూసి గర్వపడాలి.. కనీసం నిరాశ పడకూడదు" అని తన ఫ్యూచర్ సెల్ఫ్‌కు మెసేజ్ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో రెస్పాన్స్

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గూగుల్ మానేసి అమెజాన్ టీ షర్ట్ వేసుకున్న హర్షిత్‌ను చూసి కొందరు సరదాగా కామెంట్స్ చేస్తే, మరికొందరు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. "మేమందరం చేయాలనుకున్న పనిని నువ్వు చేశావు బ్రో.. ఆల్ ది బెస్ట్" అంటూ నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. బెంగళూరు (Bengaluru) లోని ఐటీ సర్కిల్స్‌లో ఇప్పుడు ఈ 'ఫ్రీడమ్' స్టోరీనే హాట్ టాపిక్.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+