బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

భారతదేశంలో బంగారం ధరలు వరుసగా క్షీణిస్తుండటం కేవలం పెట్టుబడిదారులనే కాకుండా, బంగారు రుణాలను (Gold Loans) అందించే ఆర్థిక సంస్థలను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ 'ఫిచ్' (Fitch Ratings) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ధరల తగ్గుదల గనుక ఇలాగే కొనసాగితే గోల్డ్ లోన్ కంపెనీల ఆదాయాలు, వసూళ్లపై అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు మంజూరు చేసిన రుణాలు ఇప్పుడు ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

బంగారు రుణ సంస్థలకు ప్రధాన రక్షణ కవచం 'లోన్-టు-వాల్యూ' (LTV) నిబంధన. భారతదేశంలో ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే రుణంగా ఇవ్వాలి. అంటే బంగారం ధర 25 శాతం వరకు పడిపోయినా కంపెనీలకు అసలు మొత్తం విషయంలో పెద్దగా నష్టం ఉండదు.

gold price decline India gold loan gold loan risk gold loan market India falling gold prices India gold loan regulations India gold price fall impact gold loan sector India financial risk controls gold loan lending India gold market volatility India gold price drop news gold-backed loans India India banking sector gold loans gold price fall 2026 gold loan borrower risk gold loan lender risk India gold loan policies gold loan market update gold financial risk management 2026

అయితే, ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు ఏడాదికి 15 నుండి 20 శాతం వరకు ఉంటాయి. అసలుకు ఈ వడ్డీని కూడా కలిపినప్పుడు, కంపెనీలకు ఉండే రక్షణ కవచం కేవలం 5 నుండి 10 శాతానికి తగ్గిపోతుంది. ఒకవేళ బంగారం ధరలు అంతకంటే ఎక్కువ పడిపోతే, రుణగ్రహీతలు తమ బంగారాన్ని విడిపించుకోవడానికి ఆసక్తి చూపకపోవచ్చు, ఇది డిఫాల్ట్‌లకు దారితీస్తుంది.

ఈ నష్టాన్ని అరికట్టడానికి కంపెనీలు కొన్ని వ్యూహాలను అనుసరిస్తాయి. సాధారణంగా ఆభరణాల విలువను లెక్కించేటప్పుడు కేవలం అందులోని బంగారం బరువును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాయి. ఆభరణాల్లోని రత్నాలు లేదా తయారీ ఖర్చులను (Making Charges) లెక్కించవు. దీనివల్ల కంపెనీలకు కొంత అదనపు భద్రత లభిస్తుంది. అలాగే ధరలు పడిపోతున్నప్పుడు, ఎల్‌టీవీ పరిమితిని మించకుండా ఉండేందుకు కస్టమర్ల నుండి అదనపు నగదును (Margin call/Top-up) చెల్లించాలని కోరుతుంటాయి.

అసలైన ముప్పు ఎక్కడ ఉందంటే.. ఒకవేళ ధరల తగ్గుదలతో పాటు రుణగ్రహీతల ఆదాయాలు కూడా పడిపోతే, వేలంపాటల (Auctions) సంఖ్య పెరుగుతుంది. మార్కెట్ పడిపోతున్న సమయంలో వేలంలో కూడా బంగారానికి సరైన ధర లభించకపోవచ్చు, ఇది కంపెనీల నికర వడ్డీ మార్జిన్లపై దెబ్బతీస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వంటి దిగ్గజ సంస్థలు అధిక ధరల వద్ద భారీగా రుణాలు ఇచ్చి ఉండటం వల్ల.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి నిశిత పరిశీలనలో ఉన్నాయి.

మరోవైపు, ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ కొత్త నిబంధనలు ఈ రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఎల్‌టీవీని కేవలం అసలు మొత్తంపైనే కాకుండా, అసలు, వడ్డీ రెండింటినీ కలిపి లెక్కించాల్సి ఉంటుంది. ఇది కంపెనీలు తమ రిస్క్‌ను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవడానికి సహాయపడినప్పటికీ, వ్యాపార నిర్వహణను కొంత క్లిష్టతరం చేయవచ్చు. తక్కువ మార్జిన్లు, బలహీనమైన వసూళ్ల వ్యవస్థలు ఉన్న చిన్న సంస్థలు ఈ మార్పుల వల్ల ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+