For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విద్యార్థులకు బెనిఫిట్: టీసీఎస్ అయాన్‌తో తెలంగాణ ఉన్నత విద్యామండలి భాగస్వామ్యం

|

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు టీసీఎస్ అయాన్TMతో భాగస్వామ్యం కుదుర్చుకుంది తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డిజిటల్ అభ్యాస వేదికపై సంబంధిత అభ్యాసాంశాలను ఉచితంగా పొందేందుకు తెలంగాణాలోని నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులకు వీలు కల్పిస్తుంది.

 ముఖేష్ అంబానీకి క్రూడ్ దెబ్బ, రిలయన్స్ ఆస్తులు రూ.30,000 కోట్ల డౌన్ ముఖేష్ అంబానీకి క్రూడ్ దెబ్బ, రిలయన్స్ ఆస్తులు రూ.30,000 కోట్ల డౌన్

4 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం

4 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం

దిగ్గజ ఐటీ, కన్సల్టింగ్, వ్యాపార పరిష్కారాల సంస్థ టీసీఎస్‌కు చెందిన వ్యూహాత్మక వ్యాపార విభాగం టీసీఎస్ అయాన్ భావి ఉద్యోగాలకు సిద్ధంగా రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇటీవలే తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TSCHE)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కోర్సును టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ ద్వారా పొందవచ్చు. తెలంగాణలో ఉన్న 1500కు పైగా ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 4 లక్షల మంది విద్యార్థులు పూర్తి ఉచితంగా ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని పొందవచ్చు.

భిన్న అంశాల సమ్మేళనం

భిన్న అంశాల సమ్మేళనం

ఈ కోర్స్ విద్యార్థుల ఉద్యోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే రీతిలో ఉండటంతో పాటు గ్రాడ్యుయేషన్ అనంతరం ఉద్యోగవిపణిలో పోటీ పడేందుకు సన్నద్ధం చేసే రీతిలో విభిన్నమైన అంశాల సమ్మేళనంగా ఉంటుంది. ఈ కోర్సులను ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఉపకరణం మీద అయినా TSCHE వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. ఆయా సంస్థలు క్రెడిట్‌కు తగినట్లు దీన్ని తప్పనిసరి చేయవచ్చు.

రాష్ట్ర యువతను ప్రగతిశీల మార్గంలో తీర్చిదిద్దేంకు సహాయపడే అభ్యాస సాధనాల శ్రేణిని అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, TSCHE, రాష్ట్ర నాయకత్వ ముందుచూపును టీసీఎస్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి ప్రశంసించారు. తాము అందించబోయే నైపుణ్యాలు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటాయన్నారు.

అందుకే భాగస్వామ్యం

అందుకే భాగస్వామ్యం

ఉద్యోగ విపణిలో పోటీకి తోడ్పడేందుకు అవసరమైన అన్ని నైపుణ్యాలను తమ విద్యార్థులకు సమకూర్చడానికి టీసీఎస్ అయాన్‌తో భాగస్వామ్యం చేసుకున్నామని భారీ సంస్థలలో ఒకటిగా టీసీఎస్ ఇప్పుడు, ఉన్నత విద్యా సంస్ధలతో కలిసి విద్యార్థుల పోటీతత్త్వాన్ని మెరుగుపరచడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించనుందని, భావి ఉద్యోగాలకు తగినట్లుగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే ఈ ప్రయాణంలో భాగమైన టీసీఎస్‌కు థ్యాంక్స్ చెబుతున్నట్లు TSCHE చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు.

English summary

విద్యార్థులకు బెనిఫిట్: టీసీఎస్ అయాన్‌తో తెలంగాణ ఉన్నత విద్యామండలి భాగస్వామ్యం | TSCHE Partners with TCS iON to improve employability quotient of students

Telangana State Council of Higher Education Partners with TCS iON™ to Improve Employability Quotient of State Students.
Story first published: Thursday, April 23, 2020, 20:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X