For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు!

|

చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దృష్టికి తీసుకు వెళ్లారు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల. యాప్ భద్రత, పనితీరు, కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాలను వివరించారు. ట్రంప్ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నామని, వాటికి సరైన పరిష్కారం లభించే విధంగా కొనుగోలు ఒప్పందం ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే టిక్‌టాక్ కొనుగోలుకు సంబంధించి మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ గడువు విధించారు.

టిక్‌టాక్ కొనుగోలుపై ట్రంప్‌కు సత్య నాదెళ్ల కీలక సమాచారం! ఇండియాలో ఏం చేస్తారు?టిక్‌టాక్ కొనుగోలుపై ట్రంప్‌కు సత్య నాదెళ్ల కీలక సమాచారం! ఇండియాలో ఏం చేస్తారు?

45 రోజుల గడువు

45 రోజుల గడువు

అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలు సెప్టెంబర్ 15వ తేదీలోగా విక్రయించాలని ట్రంప్ డెడ్ లైన్ పెట్టారు. అలా జరగకుంటే క్లోజ్ చేయాలని హెచ్చరించారు. చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో యాప్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తే తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇదే కాకుండా అమెరికాకు చెందిన మరే ఇతర సంస్థ అయినా కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. అయితే టిక్‌టాక్ కార్యకలాపాలు సెప్టెంబర్ 15వ తేదీ నాటికి అమెరికా సంస్థల చేతిలో ఉండటం లేదా క్లోజ్ చేయడం జరగాలని అభిప్రాయపడ్డారు.

మైక్రోసాఫ్ట్ కొనుగోలు

మైక్రోసాఫ్ట్ కొనుగోలు

టిక్‌టాక్ యాప్‌ను మైక్రోసాఫ్ట్‌తో పాటు ఏ అమెరికా కంపెనీ కొనుగోలు చేసినా చేతులు మారిన మొత్తంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలని నిబంధన విధించారు. కాగా, మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసే విషయాన్ని తొలుత ట్రంప్ తోసిపుచ్చారు. ఆ తర్వాత అధ్యక్షుడితో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఆ తర్వాత కమిటీ ఆన్ ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్(CFIUS) మైక్రోసాఫ్ట్, బైట్ డ్యాన్స్‌కు గడువు విధించింది. టిక్‌టాక్ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఎంత చెల్లించనుందో తెలియాల్సి ఉంది. అయితే బైట్ డ్యాన్స్ ఈ యాప్ వ్యాల్యుయేషన్ 50 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోందట.

100 మిలియన్ యూజర్లు, 70% ఆదాయం

100 మిలియన్ యూజర్లు, 70% ఆదాయం

టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడంపై ఆసక్తి ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అమెరికాలో టిక్‌టాక్‌కు 100 మిలియన్ల యూజర్లు ఉన్నారు. టిక్‌టాక్ కొనుగోలు ద్వారా సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్ ఇంక్, స్నాప్ ఇంక్‌లకు మైక్రోసాఫ్ట్ ఈ విభాగంలో పెద్ద కాంపిటీటర్ కానుంది. ఈ సంస్థకు ఇప్పటికే లింక్డిన్ ఉంది. అవసరమైతే టిక్‌టాక్ కొనుగోలుకు ఇతర అమెరికా మైనార్టీ ఇన్వెస్టర్లను కూడా మైక్రోసాఫ్ట్ ఆహ్వానించనుంది. చైనాను మినహాయించి బైట్ డ్యాన్స్‌కు బయటి వస్తున్న 70 శాతం ఆదాయం అమెరికా నుండి కావడం గమనార్హం.

English summary

సత్య నాదెళ్లతో భేటీ తర్వాత.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ 45 రోజుల గడువు! | Trump gives Microsoft 45 days deadline for TikTok

President Donald Trump only agreed to allow Microsoft Corp to negotiate the acquisition of popular short-video app TikTok if it could secure a deal in 45 days, three people familiar with the matter said.
Story first published: Tuesday, August 4, 2020, 18:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X