For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్ సంస్థ అదుర్స్, తొలిసారి క్రిప్టో ఫ్యూచర్ ఈటీఎఫ్

|

టారస్ క్లింగ్ బ్లాక్‌చైన్ IFSC భారత తొలి బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ను ప్రారంభిస్తోంది. ఇందుకోసం ఇండియా ఐఎన్ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ నుండి త్వరలో ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టార్టప్ టోరస్ క్లింగ్ ట్రేడింగ్ ఇండియా, రిలయన్స్ కేపిటల్ మాజీ సీఈవో శ్యామ్ ఘోష్ ఏర్పాటు చేసిన కాస్మియా ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌తో కలిసి దేశంలో తొలిసారి క్రిప్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించనుంది.

ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్ చైన్ ఐఎఫ్ఎస్‌సీ అనే సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ సంస్థ క్రిప్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌ను తీసుకు వచ్చేందుకు బాంబే స్టాక్ ఎక్స్చేంజీకి చెందిన ఇండియా ఐఎన్ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గిఫ్ట్ సిటీ నుండి దీనిని త్వరలో ఆవిష్కరించనున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చైన్ ఐఎఫ్‌ఎస్‌సీ తెలిపింది. ఇందులో బిట్ కాయిన్, ఎథేరియం ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు ఉంటాయి.

Torus Kling Blockchain to launch India’s first Bitcoin ETFs

అమెరికా బయట మొదటి క్రిఫ్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్ కావడం ప్రత్యేకం. దీంతో పాటు అమెరికాలో నమోదయిన మెటావర్స్ లార్జ్ క్యాప్ డిస్కౌంట్ సర్టిఫికెట్లను అందిస్తుంది. క్రిప్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌ను తమ ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ వ్యవస్థ, భాగస్వాముల ద్వారా పంపిణీ చేస్తామని టోరస్ క్లింగ్ తెలిపింది. రానున్న రెండేళ్ల కాలంలో రూ.7500 కోట్ల క్రిఫ్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్, డిస్కౌంట్ సర్టిఫికెట్స్ టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

English summary

హైదరాబాద్ సంస్థ అదుర్స్, తొలిసారి క్రిప్టో ఫ్యూచర్ ఈటీఎఫ్ | Torus Kling Blockchain to launch India’s first Bitcoin ETFs

Torus Kling Blockchain IFSC, a 50:50 joint venture between Sam Ghosh promoted Cosmea Financial Holdings (CFH) and Kling Trading India, signed an MOU with India INX to launch India’s first Bitcoin and Ethereum futures ETF and Metaverse US-listed large-cap discount certificates.
Story first published: Friday, January 14, 2022, 11:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X