For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jobs: దివ్యాంగులకు ఉద్యోగాలిచ్చిన టాప్ కంపెనీలు.. సూపర్ డెసిషన్..!

|

Jobs: దేశంలోని దిగ్గజ కంపెనీలు వికలాంగులకు ఉద్యోగాల్లో నియమించుకుంటూ ఆసరాగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో సహా ఇతర కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది వికలాంగులను ఉద్యోగాల్లో నియమించుకున్నాయి. నిఫ్టీ సూచీలోని కంపెనీల్లో పనిచేస్తున్న ఇంటర్న్‌లలో 75% మంది ఈ 5 కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు.

ఉద్యోగ అవకాశాలు..

ఉద్యోగ అవకాశాలు..

FY22లో టాప్- 50 లిస్టెడ్ కంపెనీల్లో 12,295 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారి ప్రతిభకు అనుగుణంగా కంపెనీలు అవకాశాలు ఇచ్చాయి. గడచిన ఏడాదితో పోల్చితే ఇది 10.6 శాతం పెరుగుదలని చెప్పుకోవాలి. అయితే శాశ్వత ఉద్యోగుల్లో అర శాతం కంటే తక్కువ మంది మాత్రమే వికలాంగులు పనిచేస్తున్నారు. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ లో మెుత్తం 2,44,250 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో కేవలం 5,096 మంది దివ్యాంగులు పనిచేస్తున్నారు.

విభిన్న ప్రతిభావంతులు..

విభిన్న ప్రతిభావంతులు..

రిలయన్స్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,42,982 ఉండగా.. వారిలో 1410 మంది వికలాంగులు ఉన్నారు. ఇక టీసీఎస్ కంపెనీలో 2000 మంది వికలాంగులు, విప్రోలో 697 మంది ఈ క్యాటగిరీ కింద పనిచేస్తున్నారు. ప్రస్తుత కాలంలో టెక్, రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లోని కంపెనీలు వైకల్యంతో బాధపడుతున్న వికలాంగులను ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్..

వర్క్ ఫ్రమ్ హోమ్..

ఇలాంటి ఉద్యోగులకు కంపెనీలు పని సమయంలో ప్రత్యేకమైన అవసరాలు కల్పించటం కూడా కొద్దిగా కష్టతరమైనదే. అందుకే చాలా కంపెనీలు ఇలాంటి వారికి వీలైనంత వరకు వర్క్ ఫమ్ హోమ్ అవకాశాలను అందిస్తున్నాయి. రానున్న కాలంలో చాలా కంపెనీలు ఇదే దారిలో ముందుకెళుతూ చాలా మందికి తమ కాళ్లపై నిలబడేందుకు తమవంతు అవకాశాలను అందిస్తాయని అంచనా.

Read more about: jobs it companies business news
English summary

Jobs: దివ్యాంగులకు ఉద్యోగాలిచ్చిన టాప్ కంపెనీలు.. సూపర్ డెసిషన్..! | Top indian companies gave job opportunity to physically disabled know details

Top indian companies gave job opportunity to physically disabled know details
Story first published: Sunday, December 4, 2022, 17:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X