For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్‌బుక్ ఇండియా ఎండీకి ఢిల్లీ ప్యానల్ సమన్లు, ఎందుకంటే

|

సోషల్ మీడియా వేదికలో విద్వేషపూరిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైందనే ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఫేస్‌బుక్-ఇండియా అధిపతికి ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ సమన్లు జారీ చేసింది. సాక్ష్యాధారాలను పరిశీలిస్తామని ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్-శాంతిభద్రతల కమిటీ శనివారం తెలిపింది. బీజేపీ నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకర పోస్టులను ఫేస్‌బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఈ సమన్లు జారీ చేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ దారుణ పతనం, 90% రుణరేటు: మూడీస్భారత ఆర్థిక వ్యవస్థ దారుణ పతనం, 90% రుణరేటు: మూడీస్

అజిత్ మోహన్‌కు నోటీసులు

అజిత్ మోహన్‌కు నోటీసులు

భారత్‌లో ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్‌కు ఢిల్లీ అసెంబ్లీ శాంతిభద్రతల కమిటీ సమన్లను పంపించింది. సెప్టెంబర్ 15వ తేదీకి విధాన సభ ప్రాంగణంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాఘవ్ నేతృత్వంలోని కమిటీ ఈ నోటీసులు పంపించింది. నలుగురు ప్రామినెంట్ జర్నలిస్ట్‌లు, డిజిటల్ రైట్స్ యాక్టివిస్ట్‌లు సహా పలువురి నుండి సేకరించిన సాక్ష్యాల ఆధారంగా ఫేస్‌బుక్‌‌కు నోటీసులు జారీ చేసినట్లు శనివారం ప్రకటన విడుదల చేశారు.

సెప్టెంబర్ 15వ తేదీలోపు హాజరు కావాలని

సెప్టెంబర్ 15వ తేదీలోపు హాజరు కావాలని

ఫేస్‌బుక్‌పై వారు సమర్పించిన ఆరోపణల్లోని వాస్తవాలను నిర్ధారించడానికి సెప్టెంబర్ 15వ తేదీలోపు తమ ఎదుట హాజరు కావాలని ఫేస్‌బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌కు సమన్లు జారీ చేశారు. తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ నాయకుడు ఒకరు ఓ వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంలో విఫలమైందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో గత వారం భారత పార్లమెంటరీ కమిటీ కూడా మోహన్‌ను విచారించింది. అయితే ఫేస్‌బుక్ మాత్రం రాజకీయ పక్షపాతం ఆరోపణలను ఖండించింది. అలాగే, ద్వేషపూరిత కంటెంట్‌ను మరింతగా అరికట్టాల్సి ఉందని అభిప్రాయపడింది.

కలహాలు..

కలహాలు..

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో మత కలహాలు చోటు చేసుకున్నాయని, ఈ కలహాలను తీవ్రతరం చేసేందుకు ఫేస్‌బుక్ సహకరించిందని, విద్వేష పూరిత ప్రసంగాలను పూర్తిగా వదిలివేసిందని ఆగస్ట్ 31న జరిగిన రెండో విచారణలో కమిటీ తేల్చింది. ద్వేషపూరిత కంటెంట్‌కు సంబంధించి ఇండియా పాలసీ చీఫ్‌ను తొలగించాలని అమెరికా సివిల్ రైట్స్ గ్రూప్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అడుగులు కీలకంగా మారాయి.

English summary

ఫేస్‌బుక్ ఇండియా ఎండీకి ఢిల్లీ ప్యానల్ సమన్లు, ఎందుకంటే | Top Facebook official summoned by Delhi panel over hate speech complaints

A top Facebook executive has been summoned by a Delhi assembly panel headed by the Aam Aadmi Party MLA Raghav Chadha over complaints alleging "deliberate inaction on the part of social media platform to apply hate speech rules".
Story first published: Sunday, September 13, 2020, 7:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X