For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూపే కార్డులకు టోకెనైజేషన్, ఇక మరింత భద్రం

|

రూపే కార్డుల్లో డేటా భద్రతను మరింత పదిలం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అంటే మర్చంట్ల వద్ద కార్డు వివరాలను భద్రపరిచేందుకు ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థను వినియోగిస్తారు. దీంతో కస్టమర్ల వివరాలకు మరింత గోప్యత, భద్రత ఉంటుంది. అలాగే కొనుగోళ్లు సులభం అవుతాయి. ఎన్‌క్రిప్టెడ్ రూపంలో కస్టమర్ సమాచారాన్ని టోకెన్ రూపంలో భద్రపరచడంతో ట్రాన్సాక్షన్స్‌కు భద్రత ఏర్పడుతుంది. కస్టమర్ వివరాలను వెల్లడించకుండానే చెల్లింపు ప్రక్రియకు ఈ టోకెన్లు వీలు కల్పిస్తాయి. NPCI టోకెనైజేషన్ సిస్టం కింద బ్యాంకులు, అగ్రిగేటర్లు, మర్చంట్స్, ఇతరులు NPCI వద్ద ధృవపత్రం పొందితే టోకెన్ రిక్వెస్టర్ పాత్రను పోషించవచ్చు.

రూపే కార్డు వినియోగదారులు భవిష్యత్తులో చేసే ట్రాన్సాక్షన్స్‌కు ఈ అన్ని వ్యాపార వర్గాలు తమ రూపే కస్టమర్ల టోకెన్ రిఫరెన్స్ ఆన్‌ఫైల్(TROF)ను వినియోగించుకోవచ్చు. ఈ పారదర్శక వ్యవస్థ కారణంగా కస్టమర్ సమాచారం లీక్ కాదు. చెల్లింపు ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ విధానంలో కస్టమర్‌కు సంబంధించిన ముఖ్యైన సమాచారం ఎన్‌క్రిప్టెడ్ టోకెన్ రూపంలో స్టోర్ అయి ఉంటుంది. దీంతో షాపింగ్ చేసిన ప్రతిసారి కస్టమర్ వారి సమాచారం అందించే అవసరం ఉండదు. అలాగే కస్టమర్‌కు చెందిన కీలక సమాచారం పేమెంట్ ఇంటర్మీడియేటరీలు స్టోర్ చేసే వీలు ఉండదు. NPCI సర్టిఫై చేసిన బ్యాంకులు, అగ్రిగేటర్లు మాత్రమే కార్డులు టోకెన్ రిఫరెన్స్‌లు సేవ్ చేయడానికి వీలుంటుంది.

Tokenisation platform for RuPay cards

రూపే కార్డు భార‌త‌దేశంలోనే రూపొందించిన ఎల‌క్ట్రానిక్ పేమెంట్ కార్డు. ఇది ఏటీఎమ్ క‌మ్ డెబిట్ కార్డుగా ప‌నిచేస్తుంది. రూపాయి, పేమెంట్ అనే ప‌దాలు క‌లిసి వ‌చ్చేలా రూపే కార్డు అని పేరు పెట్టారు. నేష‌నల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వారు నిర్వ‌హిస్తున్న ఈ కార్డుతో బిల్లు చెల్లింపులు, ఆన్‌లైన్ లావాదేవీలు జ‌ర‌పొచ్చు. రూపే కార్డును దేశంలోని అన్ని ఏటీఎమ్‌ల్లోనూ, వ్యాపార స‌ముదాయాల్లోనూ ఉప‌యోగించ‌వ‌చ్చు.

English summary

రూపే కార్డులకు టోకెనైజేషన్, ఇక మరింత భద్రం | Tokenisation platform for RuPay cards

NPCI announced the launch of NPCI Tokenization system (NTS) to support tokenisation of cards as an alternate to storing card details with merchants.
Story first published: Thursday, October 21, 2021, 9:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X