For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రత్యర్థి సంస్థకు టిక్‌టాక్ అమ్మేందుకు ప్రయత్నాలు

|

చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ తన భారత కార్యకలాపాలను విక్రయించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇక్కడి తన వ్యాపార కార్యకలాపాలను తన ప్రత్యర్థి కంపెనీ యూనీకార్న్ గ్లాన్స్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జపాన్‌కు చెందినసాఫ్ట్‌ బ్యాంకు గ్రూప్ కార్పోరేషన్ ఈ చర్చలకు తెరలేపిందని తెలుస్తోంది. అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయట.

భారత్ - చైనా మధ్య దాదాపు రెండేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది జూన్ నెలలో టిక్‌టాక్ సహా పలు యాప్స్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో భారత వ్యాపారాన్ని ఇతరులకు విక్రయించే అంశంపై చర్చలు జరుగుతున్నట్లుగా అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృసంస్థతో పాటు గ్లాన్స్ సంస్థల్లో సాఫ్టుబ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ విక్రయానికి సాఫ్టుబ్యాంక్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ డీల్ ముందుకు వెళ్లాలంటే భారత ప్రభుత్వం అనుమతి అవసరం.

Tiktok is reportedly negotiating a sale of Indian TikTok assets

ఈ అంశానికి సంబంధించి అటు టిక్‌టాక్ అటు గ్లాన్స్ లేదా సాఫ్ట్ బ్యాంక్ స్పందించలేదు. టిక్‌టాక్‌‌కు భారత్‌లో మిగిలి ఉన్న ఆస్తులను లాభసాటిగా మార్చి నష్టాన్ని పూడ్చుకోవాలనేది సాఫ్ట్ బ్యాంక్ ఆలోచనగా ఉందని అంటున్నారు. భారత్‌లోని ఆస్తులను ఇక్కడే అమ్మేందుకు బైట్ డ్యాన్స్ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది.

English summary

ప్రత్యర్థి సంస్థకు టిక్‌టాక్ అమ్మేందుకు ప్రయత్నాలు | Tiktok is reportedly negotiating a sale of Indian TikTok assets

China's ByteDance is said to be exploring the sale of the India operations of TikTok to rival unicorn Glance.
Story first published: Sunday, February 14, 2021, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X