For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీసీఎస్ సూపర్బ్: తొమ్మిదేళ్లలోనే తొలిసారి... థ్యాంక్స్ టు కొవిడ్-19!

|

ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదరగొట్టింది. శుక్రవారం మార్కెట్ అనంతరం ప్రకటించిన ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలు మించి వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.8701 కోట్లు ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.8118 కోట్లతో 7.2 శాతం అధికం. కంపెనీ ఆదాయం కూడా 5.4 శాతం వృద్ధి సాధించి ఏడాది ప్రాతిపదికన రూ.39854 కోట్ల నుండి రూ.42015 కోట్లకు పెరిగింది.

TCS Q3 results: అదరగొట్టిన టీసీఎస్, ఒక్కో షేర్ పైన రూ.6 డివిడెండ్TCS Q3 results: అదరగొట్టిన టీసీఎస్, ఒక్కో షేర్ పైన రూ.6 డివిడెండ్

తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి

తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి

సాధారణంగా మూడో త్రైమాసికం డల్‌గా ఉంటుందని, కానీ ఈసారి ఐటీ కంపెనీలు భారీ లాభాలను, ఆదాయాలను నమోదు చేస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి టీసీఎస్ లాభాలు, ఆదాయాలు నమోదు చేయడం గమనార్హం. మూడో త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి కనబరచడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి అని టీసీఎస్ ప్రకటించింది. కొత్త ఏడాదిలోకి తాము ఆశావాహ దృక్పథంతో ఎంటర్ అవుతున్నామని, తమ మార్కెట్ గతం కంటే బలంగా ఉందని, ఆర్డర్ బుక్, డీల్ పైప్‌లైన్ బలంగా టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ అన్నారు.

థ్యాంక్స్ టు కోవిడ్ 19!

థ్యాంక్స్ టు కోవిడ్ 19!

గత తొమ్మిదేళ్ల కాలంలో డిసెంబర్ కాలంలో ఇంత మేర వృద్ధి నమోదు కావడం వెనుక ప్రధాన కారణంగా కరోనా మహమ్మారిగా చెబుతున్నారు. కరోనా కారణంగా ఐటీ సంస్థలు టెక్ అడాప్షన్‌ను వేగవంతం చేశాయి. అందుకే కరోనాకు థ్యాంక్స్ చెబుతున్నారు!

ఎక్కడి నుండి ఎంత అంటే

ఎక్కడి నుండి ఎంత అంటే

టీసీఎస్ వృద్ధి మ్యానుఫ్యాక్చరింగ్ (7.1 శాతం వరకు), BFSI (2 శాతం వరకు), లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్ (5.2 శాతం వరకు), కమ్యూనికేషన్ & మీడియా (5.5 శాతం వరకు), రిటైల్ & సీపీజీ (3.1 శాతం వరకు) వృద్ధి నమోదు చేశాయి. నార్త్ అమెరికా నుండి 3.3 శాతం, భారత్ 18.1 శాతం, యూకే 4.5 శాతం, యూరోప్ 2.5 శాతం వృద్ధి నమోదు చేయగా, ఆసియా పసిఫిక్, ఇతర ప్రాంతాల్లో 2.6 శాతం వృద్ధి నమోదయింది. లాటిన్ అమెరికా 3.1 శాతం నమోదయింది.

English summary

టీసీఎస్ సూపర్బ్: తొమ్మిదేళ్లలోనే తొలిసారి... థ్యాంక్స్ టు కొవిడ్-19! | This was their strongest autumn in nine years thanks to COVID: TCS

Tata Consultancy Services (TCS) has beaten market expectations and delivered another winning performance in the quarter ending December 2020. It reported its strongest third quarter results in nine years, thanks to COVID-induced acceleration in tech adoption.
Story first published: Friday, January 8, 2021, 21:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X