For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఝున్‌ఝున్‌వాలా కాదు.. దమానీ అసలే కాదు: అతిపెద్ద స్టాక్ పోర్ట్‌పోలియో ఈ వ్యాపారవేత్తదే

|

భారత స్టాక్ మార్కెట్‌లో ప్రముఖ ఇన్వెస్టర్స్ పేరు చెప్పమని అడిగితే తొలుత గుర్తుకు వచ్చేది రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. ఆ తర్వాత డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్ అధినేత రాధాకిషన్ ధమానీ పేరు గుర్తుకు వస్తుంది. అయితే అత్యధిక స్టాక్ పోర్ట్‌పోలియో కలిగి ఉన్నవారు ఎవరో తెలుసా? స్టాక్ పోర్ట్‌పోలియో పరంగా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మూడో స్థానంలో, ధమానీ రెండో స్థానంలో ఉన్నారు. కానీ మొదటి స్థానంలో ఉన్నవారు విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గురించి మనం తరుచూ మాట్లాడే పేర్లు దమానీ, రాకేష్. ఈ మార్కెట్ మూవర్స్ వ్యాపారంలో స్టాక్ తాజా స్థితి/ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్నప్పుడు/ఇన్వెస్టర్లు వాటాలు తగ్గించుకున్నప్పుడు/కౌంటర్ నుండి నిష్క్రమించినప్పుడు మారుతుంటాయి. ఏది ఏమైనా పెట్టుబడి పరంగా అతిపెద్ద పోర్ట్‌పోలియో కలిగిన వారిలో ప్రేమ్‌జీ ముందున్నారు.

ప్రేమ్‌జీ అండ్ అసోసియేట్స్

ప్రేమ్‌జీ అండ్ అసోసియేట్స్

ట్రెండ్‌లైన్ ప్రకారం విప్రో మాజీ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రేమ్‌జీ అండ్ అసోసియేట్స్ నాలుగు స్టాక్స్‌లో రూ.267,502.5 కోట్ల విలువ కలిగిన షేర్లను కలిగి ఉన్నారు. ప్రేమ్‌జీ అండ్ అసోసియేట్స్ సాఫ్టువేర్ అండ్ సర్వీసెస్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది.

విప్రోలో అక్టోబర్ 25, 2021 నాటికి రూ.266,475.7 కోట్ల వ్యాల్యూ కలిగిన 3,997,835,444 షేర్లను కలిగి ఉన్నారు.

అలాగే, అక్టోబర్ 25, 2021 నాటికి ట్రెంట్ లిమిటెడ్‌లో రూ.582.4 కోట్లు కలిగిన 5,533,597 షేర్లను కలిగి ఉంది. దేశంలో ప్రముఖ రిటైల్ ఇండస్ట్రీ ఇది.

ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రూ.389.2 కోట్ల వ్యాల్యూ కలిగిన 2,820,161 షేర్లను కలిగి ఉంది.

సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు సమయానికి క్రాఫ్ట్‌మాన్ ఆటోమెషన్ లిమిటెడ్‌లో రూ.55.2 కోట్ల వ్యాల్యూ కలిగిన 223,400 షేర్లు ఉన్నాయి.

రాధాకిషన్ ధమానీ

రాధాకిషన్ ధమానీ

రెండో అతిపెద్ద ఇన్వెస్టర్ రాధాకిషన్ ధమానీ. అవెన్యూ సూపర్ మార్ట్స్ అధినేత. ఈక్విటీ మార్కెట్‌లో అతను రూ.196,101.73 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అక్టోబర్ 25 నాటికి 14 స్టాక్స్‌లో రూ.191,715.7 కోట్లను కలిగి ఉన్నారు. మంగళం ఆర్గానిక్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్, ఆంధ్రా పేపర్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, యునైటెడ్ బీవరీస్, అవెన్యూ సూపర్ మార్ట్స్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్ హోల్డింగ్స్, బ్లు డార్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి వివిధ స్టాక్స్ ఉన్నాయి.

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మూడో స్థానంలో ఉన్నారు. ఈ కుబేరుడి పోర్ట్‌పోలియోలో 39 స్టాక్స్ ఉన్నాయి. రూ.24,046.7 కోట్ల విలువ కలిగిన షేర్లను కలిగి ఉన్నారు. రాకేష్ ఇటీవల పలు స్టాక్స్‌లో తన వాటాలు పెంచుకున్నారు. టైటాన్‌తో పాటు మూడు కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. మెటల్ స్టాక్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), నాల్కోలలో వాటాలు పెంచుకున్నారు.

English summary

ఝున్‌ఝున్‌వాలా కాదు.. దమానీ అసలే కాదు: అతిపెద్ద స్టాక్ పోర్ట్‌పోలియో ఈ వ్యాపారవేత్తదే | This Indian tycoon and his firm hold the largest stock portfolio

The number one position in stock market, is held by non other than the Indian tycoon Azim Premji, former Wipro chairman.
Story first published: Tuesday, October 26, 2021, 12:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X