For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పతనమైన క్రిప్టో మార్కెట్, 27% ఉద్యోగుల్ని తొలగించిన ఈ ఎక్స్చేంజ్

|

క్రిప్టో మార్కెట్ కాస్త పుంజుకుంది. అయినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే మూడింట రెండొంతులకు పైగా క్షీణతతోనే ఉంది. క్రిప్టో మార్కెట్ గత కొంతకాలంగా ఎలా ఉన్నదంటే ఓ క్రిప్టో ఎక్స్చేంజ్ అయితే ఏకంగా తమ ఉద్యోగుల్లో 27 శాతం మందిని తొలగించిందట. అంటే దాదాపు మూడొంతుల వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంది. ప్రస్తుతం మార్కెట్ తీవ్ర ఊగిసలాటలో ఉంది. ఈ నేపథ్యంలో పీటర్ థీల్ బ్యాక్డ్ బిట్‌పాండా జీఎంబీహెచ్ వెయ్యి మంది నుండి తమ ఉద్యోగులను 730 మందికి తగ్గించుకుంటోంది.

ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ గత ఏడాది నవంబర్ నాటి ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే 70 శాతం మేర క్షీణించింది. 69,000 డాలర్ల నుండి 21,000 డాలర్లకు పతనమైంది. బిట్ కాయిన్ గత 24 గంటల్లో 20,900 గంటల వద్ద కనిష్టాన్ని, 21,846 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 409 డాలర్లు పెరిగింది.

This crypto exchange has sacked 27 percent of workforce amid market volatility

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.72 శాతం, ఎథేరియం 3.25 శాతం, బియాన్స్ కాయిన్ 3.19 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 2 శాతం, సోలానా 1.88 శాతం, కార్డానో 6 శాతం, స్టెల్లార్ 1 శాతం, క్రిప్టో డాట్ కామ్ 3.8 శాతం, డోజీకాయిన్ 11.65 శాతం, షిబా ఇను 5.30 శాతం లాభపడ్డాయి. గత ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా కీప్ నెట్ వర్క్ 30 శాతం, డిస్ట్రిక్టాక్స్ 22 శాతం, ఏప్ కాయిన్ 17 శాతం లాభపడ్డాయి. స్టోర్జ్, రిక్వెస్ట్ మాత్రం 4 శాతం మేర క్షీణించాయి.

English summary

భారీగా పతనమైన క్రిప్టో మార్కెట్, 27% ఉద్యోగుల్ని తొలగించిన ఈ ఎక్స్చేంజ్ | This crypto exchange has sacked 27 percent of workforce amid market volatility

As a part of cost-cutting measures announced in response to the shaky market climate, Peter Thiel-backed Bitpanda GmbH would trim headcount from over 1,000 to roughly 730.
Story first published: Sunday, June 26, 2022, 20:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X