అధిక రాబడిని కోరుకునే పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలలో మిడ్-క్యాప్ ఫండ్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిలో రిస్క్ ఉంటుందని మాత్రం మర్చిపోవద్దని చెబుతున్నారు. పలు మిడ్ క్యాప్ ఫండ్లు గత మూడు సంవత్సరాల్లో 20% కంటే ఎక్కువ రాబడిని ఇస్తున్నాయి. నవంబర్ 7, 2022న అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మిడ్-క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఏవో చూద్దాం...

యూనియన్ మిడ్‌క్యాప్ ఫండ్
యూనియన్ మిడ్‌క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ మార్చి 2020లో ప్రారంభించారు. అప్పటి నుంచి 52.12% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 50.18% రాబడిని ఇచ్చింది. పథకం S&P BSE 150 MidCap ఇండెక్స్‌లో పెట్టుబడి పెడుతుంది.

మిరే అసెట్ మిడ్‌క్యాప్ ఫండ్
Mirae అసెట్ మిడ్‌క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి 28.96% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 23.86% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ లో పెట్టుబడి పెడుతుంది.

సుందరం మిడ్ క్యాప్ ఫండ్
సుందరం మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి 16.93% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 50.18% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.

మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్
మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి 22.64% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 21.14% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ మిడ్‌క్యాప్ 150లో పెట్టుబడి పెడుతుంది.

ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్
ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి 21.13% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 12.05% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది.

కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్
కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి 20.37% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 14.02% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 లో పెట్టుబడి పెడుతుంది.

PGIM ఇండియా మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్
PGIM ఇండియా మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి 19.86% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 18.37% రాబడిని ఇచ్చింది.

ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్
ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి 19.85% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 15.22% రాబడిని ఇచ్చింది.

HDFC మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్
హెచ్‌డిఎఫ్‌సి మిడ్-క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి 19.83% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 16.40% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 పెట్టుబడి పెడుతుంది.

SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్
SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుండి 19.78% రాబడిని అందించగా, సాధారణ ప్లాన్ 16.67% రాబడిని ఇచ్చింది.
Note: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. వీటిలో పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications