For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019లో ఈ వ్యాపారుల అదృష్టం తిరగబడింది!: జైలు జీవితం నుంచి...

|

2019 క్యాలెండర్ ఇయర్‌లో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు ఆందోళన కలిగించాయి. బంగారం వంటి లోహాల ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం రికార్డులు నమోదు చేశాయి. వివిధ కంపెనీలు భారీ లాభాలు నమోదు చేసినప్పటికీ కొంతమంది భారత వ్యాపారవేత్తలకు 2019 కన్నీళ్లు మిగిల్చింది. కొందరిని రుణఎగవేతదారులుగా మిగిల్చింది. వివిధ కంపెనీలు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే పరిస్థితులు లేదా కంపెనీలు దివాళా తీశాయి.

మధ్యలో ఆగిన 'మోడీ' మార్క్ బిజినెస్, భారత్‌కు దూరంగా ఇన్వెస్ట్మధ్యలో ఆగిన 'మోడీ' మార్క్ బిజినెస్, భారత్‌కు దూరంగా ఇన్వెస్ట్

అదృష్టం తిరగబడింది

అదృష్టం తిరగబడింది

ఇండియన్ బ్యాంకులు సెప్టెంబర్ నెలలో 39 బిలియన్ డాలర్ల లోన్లను మాఫీ చేసింది. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కొంతమంది వ్యాపారులు దేశం విడిచి వెళ్లిపోయారు. వీరిని తిరిగి భారత్ రప్పించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ప్రజలు ఆ వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొంతమంది బడా వ్యాపారవేత్తల అదృష్టం ఈసారి తిరగబడింది.

అనిల్ అంబానీ

అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ. ఇతని అన్న ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడు. ఈ ఏడాది (2019) మార్చిలో ముఖేష్ అంబానీ చివరి నిమిషంలో అనిల్ జైలుకు వెళ్లకుండా కాపాడారు. స్వీడన్ కంపెనీ ఎరిక్సన్‌తో అనిల్‌కు చెందిన ఆర్‌కామ్ 2013కు కుదిరిన ఒప్పందానికి సంబంధించి ఆ సంస్థకు పెద్ద మొత్తంలో చెల్లించాలి. దానిని చెల్లించలేని పరిస్థితుల్లో ముఖేష్ అంబానీ తమ్ముడిని బయటపడేశారు.

మల్వీందర్, శివీందర్ సింఘ్

మల్వీందర్, శివీందర్ సింఘ్

మాజీ బిలియనీర్లు మల్వీందర్ సింగ్ (47), శివీందర్ సింగ్ (44)లకు ఈ ఏడాది దారుణ అనుభవాన్ని మిగిల్చింది. ఫోర్టిస్, రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు వీరు. వీరిది ప్రముఖ వ్యాపార కుటుంబం. ఓ సమయంలో టాప్ డ్రగ్ మేకర్, రెండో అతిపెద్ద హాస్పిటల్ చైన్ కలిగి ఉన్నారు. అయితే 339 మిలియన్ డాలర్లను డైవర్ట్ చేసిన కేసులో అక్టోబర్ నెలలో వీరిద్దరు అరెస్టు అయ్యారు. ఆసుపత్రిలోను అక్రమాలు వెలుగు చూశాయి. 2 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం కుప్పకూలింది. అంతేకాదు, ఈ సోదరుల మధ్య విభేదాలు వచ్చాయి.

వీజీ సిద్ధార్థ

వీజీ సిద్ధార్థ

ఇండియన్ బిగ్గెస్ట్ కాఫీ చైన్ కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన ఓ సూసైడ్ నోట్ రాశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

నరేష్ గోయల్

నరేష్ గోయల్

విలువ ఆధారంగా భారత్‌లో అతిపెద్ద ఇండియన్ ఎయిర్ లైన్స్‌ను నిర్మించిన నరేష్ గోయల్ ఈ ఏడాదిలోనే జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. రుణదాతలు, భాగస్వాముల ఒత్తిడితో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. నరేష్ గోయల్ విదేశాలకు వెళ్లకుండా న్యాయస్థానం జూలైలో ఆదేశాలు జారీ చేసింది. 2.6 బిలియన్ డాలర్ల ఫ్రాడ్‌కు సంబంధించి కేసును దర్యాఫ్తు చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో అతనిని విదేశాలకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది.

రానా కపూర్

రానా కపూర్

ఈ ఏడాది (2019) జనవరిలో యస్ బ్యాంక్ రెగ్యులేటర్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా రానా కపూర్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు నిరాకరించింది. దీంతో 62 ఏళ్ల రానా కపూర్ జనవరి చివరి నాటికి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జూలైలో తన యస్ బ్యాంకు షేర్లలో కొన్నింటిని తాకట్టు పెట్టిన కపూర్ అక్టోబర్ నాటికి అన్నింటిని విక్రయించారు.

సుభాష్ చంద్ర

సుభాష్ చంద్ర

రైస్ ట్రేడర్ నుంచి మీడియా మొఘల్‌గా ఏదిగిన 69 ఏళ్ల సుభాష్ చంద్ర నవంబర్ నెలలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రాజెస్ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 1990లో జీ టీవీ పేరుతో ఇండియన్ హోమ్స్‌లోకి కేబుల్ టీవీని తీసుకు వచ్చారు. ఎస్సెల్ గ్రూప్ డెబిట్స్ పే చేసేందుకు సుభాష్ చంద్ర జీ ఎంటర్టైన్మెంట్‌లోని తన వాటాను కొద్ది నెలలుగా విక్రయిస్తున్నారు. వీరే కాకుండా అవంత గ్రూప్ గౌతమ్ తాపర్, ఎస్సార్ స్టీల్ ఇండియా శశికాంత్, రవికాంత్ రుయాలకు కూడా ఈ ఏడాది చేదు అనుభవం మిగిల్చింది.

English summary

2019లో ఈ వ్యాపారుల అదృష్టం తిరగబడింది!: జైలు జీవితం నుంచి... | The year Indian tycoons faced bankruptcies, jail and even death

For many Indian tycoons, 2019 turned woeful as lenders -- empowered by the nation’s recent bankruptcy law and desperate to clean up soured debt from their books started seizing assets of delinquent firms or dragged them into insolvency.
Story first published: Tuesday, December 31, 2019, 13:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X