For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Federal Reserve: వరుసగా నాల్గోసారి వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడ్.. పడిపోయిన మార్కెట్లు..

|

అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంక్.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా, US సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ దాని FOMC సమావేశం తర్వాత వడ్డీ రేటును 75 bps పెంచింది. అధిక ద్రవ్యోల్బణ రేటును నియంత్రించడానికి, US ఫెడ్ తన కఠినమైన ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2% తగ్గించడానికి FOMC కట్టుబడి ఉందని ఫెడ్ స్పష్టం చేసింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగో సారి.

నాస్‌డాక్

నాస్‌డాక్

వడ్డీరేట్ల పెంపుతో పాటు, ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో US స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. S&P 500 2.50% క్షీణించి, 3,759.69 పాయింట్లకు తగ్గింది. నాస్‌డాక్ కాంపోజిట్ 3.36% క్షీణించి, 10,524.80 వద్ద ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.55% క్షీణించి, 32,147.76 పాయింట్ల వద్ద ట్రేడ్‌లో నిలిచింది. మరోవైపు US 2-సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్ దాదాపు 4.628%కి పెరిగింది. US 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ దాదాపు 4.115% పెరిగింది.

భారత మార్కెట్లు

భారత మార్కెట్లు

ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో ఆసియా మార్కెట్లు ప్రభావితమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ప్రారంభ ట్రేడ్‌లో 278 పాయింట్లు క్షీణించి 60,628 వద్దకు చేరుకుంది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 0.4 శాతం పడిపోయినప్పటికీ 18,020 స్థాయి కొనసాగుతోంది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (MPC) శుక్రవారం సమావేశమవుతుంది. వరుసగా మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

బీఎస్ఈ-30

బీఎస్ఈ-30

బీఎస్ఈ-30 లో టైటాన్, యాక్సిస్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, ఎస్బీఐఎన్, ఎల్&టీ, ఇండస్ లాండ్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, డా. రెడ్డీస్ లాభాల్లో ఉండగా.. సన్ ఫార్మా, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు, హెచ్ సీఎల్ టెక్, ఎన్టీపీసీ, ఎమ్ &ఎమ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

English summary

Federal Reserve: వరుసగా నాల్గోసారి వడ్డీ రేట్లు పెంచిన యూఎస్ ఫెడ్.. పడిపోయిన మార్కెట్లు.. | The US Federal Reserve has raised interest rates for the fourth time in a row

The US Fed has once again raised interest rates. The decision was taken by increasing the interest rate by 75 basis points.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X