For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!

|

జనవరి 30, 31 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ విరమించుకుంది. డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్‌తో ఫోరం సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల బ్యాంకింగ్, పెన్షన్ అప్‌డేట్, మెరుగైన సేవలందించేందుకు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని శాఖల్లో ఎక్కువ మంది ఉద్యోగుల నియామకం సహా పలు డిమాండ్ల కోసం సమ్మె చేస్తామని నోటిసు ఇచ్చారు. చర్చల అనంతరం తమ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్‌బీయూ శనివారం పేర్కొంది.

యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)లో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ (INBEC), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) యూనియన్లు ఉన్నాయి.

 The United Forum of Bank Unions has called off the planned strike

ఈ యూనియన్లు అన్ని కలిసి ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్‌ రద్దు, వేతన పెంపు సవరణపై చర్చలకు ఆహ్వానించడం, ఖాళీగా ఉన్న విభాగాల్లో భర్తీ, తదితర డిమాండ్లతో సమ్మె చేయాలని నిర్ణయించాయి. ఈ డిమాండ్లపై జనవరి 31న యూనియన్లతో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్ భేటీ కావడానికి ఒకే చెప్పడంతో సమ్మెను వాయిదా వేసినట్లు యూనియన్లు ప్రకటించాయి.

English summary

Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..! | The United Forum of Bank Unions has called off the planned strike

The United Forum of Bank Unions called off the nationwide bank strike on January 30 and 31. This decision was taken after a forum meeting with the Deputy Chief Labor Commissioner.
Story first published: Saturday, January 28, 2023, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X